Greater Noida gang rape incident: దేశంలో ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రతీ రోజూ దేశంలో ఎక్కడోొ ఓ చోట అత్యాచార సంఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. చాలా కేసుల్లో నమ్మకంగా ఉన్న వారే అమ్మాయిలు, మహిళలు, బాలికల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వావీ వరసలు, చిన్నాపెద్దా తేడా లేకుండా అత్యాచారాలకు తెగబడుతున్నారు.
Google Layoff: ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు ఐటీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ కూడా ప్రపంచ వ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ శుక్రవారం ఓ మెమోలో తెలిపారు. మైక్రోసాఫ్ట్ 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన తర్వాతి రోజే గూగుల్ 12,000…
Man survived on ketchup while lost at sea for 24 days: నిజంగా జీవించాలని రాసిపెట్టి ఉంటే ఎంతటి క్లిష్టపరిస్థితుల్లో అయినా సహాయం లభిస్తుంది. సరిగ్గా ఇలాంటిదే ఈ స్టోరి. సముద్రంలో తప్పిపోయిన వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఏకంగా 24 రోజుల పాటు సముద్రంలో ఎక్కడ ఉన్నాడో తెలియదు, మాట్లాడేందుకు ఎవరూ లేరు, సహాయం దొరుకుతుందో లేదో అనే పరిస్థితుల నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఎల్విన్ ఫ్రాంకోయిస్(47) అనే వ్యక్తి 24 రోజుల పాటు ఒంటరిగా సముద్రంలో గడిపి, చావు నుంచి…
Air India Fined 30 Lakhs, Pilot's Licence Suspended For 3 Months: గతేడాది నవంబర్ నెలలో న్యూయార్క్-ఢిల్లీ ఎయిర్ ఇండియాలో ఓ ప్రయాణికులు మద్యం మత్తులో మూత్రవిసర్జన చేసిన సంఘటన దేశ విమానయాన రంగంపై పలు విమర్శలు వచ్చాయి. దీనిపై విమానయాన రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. ఈ ఘటనపై ఆగ్రహంతో ఉంది. ఈ మేరకు డీజీసీఏ చర్యలు ప్రారంభించింది. ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధించడంతో పాటు పైలెట్ నిర్లక్ష్యం కూడా ఉండటంతో అతని…
Supreme Court Rejects Google's Request Against ₹ 1,337 Crore Penalty: అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ కు సుప్రీంకోర్టులో గురువారం చుక్కెదురు అయింది. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) తీర్పును సవాల్ చేస్తూ గూగుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్టే ఇవ్వాలని సుప్రీంను కోరింది. అయితే ఈ కేసుపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. నిబంధనలను అతిక్రమించి గుత్తాధితప్యంగా వ్యవహరిస్తోందని గూగుల్ పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) రూ.1337 కోట్ల జరిమానా విధించింది. దీనిపై గూగుల్ సుప్రీంను…
Microsoft Layoff: ఆర్థికమాంద్యం భయాలు టెక్ దిగ్గజ కంపెనీలను భయపెడుతున్నాయి. ఆదాయాలు తగ్గడంతో ఖర్చులను అదుపు చేసేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మెటా వంటి సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. తాజాగా ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ కూడా చేరింది. ఏకంగా 10,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం నుంచే తొలగింపుల ప్రక్రియను చేపట్టింది. ఈ ఏడాది మూడో త్రైమాసికం కల్లా ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ప్రకటించింది.
BBC documentary on Prime Minister Modi: గుజరాత్ 2002 అల్లర్ల నేపథ్యంలో బీబీసీ రూపొందించిన ‘‘ ఇండియా: మోదీ క్వశ్చన్’’ డ్యాకుమెంటరీ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీపై భారత ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. బీబీసీ వలసవాద మనస్తత్వంతో, ప్రచారంలో భాగంగా ఇదంతా చేస్తోందని భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. 2002 గుజరాత్ అల్లర్లలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నరేంద్ర మోదీకి క్లీన్ చిట్ ఇచ్చిన సంగతిని ప్రస్తావిస్తున్నారు బీజేపీ…
Scoot Airlines Incident: ఇటీవల బెంగళూర్ విమానాశ్రయంలో 50 మంది ప్రయాణికులను వదిలేసి వెళ్లింది ఇండిగో ఫ్లైట్. ఈ ఘటన మరవక ముందే సింగపూర్ కు చెందిన బడ్జెట్ ఎయిర్ లైనర్ ‘స్కూట్ ఏయిర్ లైన్స్’ 35 మంది ప్రయాణికులను వదిలేసి వెళ్లింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. స్కూట్ ఎయిర్ లైన్స్ విమానం పంజాబ్ అమృత్ సర్ నుంచి సింగపూర్ కు వెళ్లాల్సి ఉంది. అయితే విమానం బుధవారం సాయంత్రం 7.55 నిమిషాలకు వెళ్లాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా మూడు…
PM Modi To Distribute 71,000 Job Letters To New Recruits On Jan 20: ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన ఉద్యోగులకు ప్రధాని నరేంద్రమోదీ జాబ్ లెటర్స్ అందిచనున్నారు. జనవరి 20న దాదాపుగా 71,000 మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందిచబోతున్నారు. ప్రధాని మంత్రి కార్యాలయం(పీఎంఓ) ప్రకారం.. ప్రధాని మోదీ వీడియో కాన్పరెన్స్ ద్వాారా ఉదయం 10.30 గంటలకు అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేస్తారని, కొత్తగా జాబులో చేరబోతున్న ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించింది.