అల్వాల్ పరిధిలో దారుణం వెలుగుచూసింది. యువతి కార్ లో ట్రాకింగ్ డివైస్ పెట్టీ బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఓ నిత్య పెళ్లి కొడుకు. స్థానిక నేత పై తప్పుడు ఫిర్యాదు ఇవ్వాలని బాధితురాలి పై ఒత్తిడి చేస్తున్నాడు. జిమ్ లో పరిచయం అయిన యువతిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు నిత్య పెళ్లి కొడుకు రవి అలియాస్ రఫీ, అతడి సోదరుడు రూపేష్. బాధితురాలి ఆడియోలు మార్ఫిఫింగ్ చేసి యూ ట్యూబ్ లో అప్లోడ్ చేసి వేధింపులకు పాల్పడుతున్నారు […]
గణేశ్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా మెట్రో రాకపోకల సమయాల్లో మార్పులు చేసింది హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ. లాస్ట్ ట్రైన్ మధ్యరాత్రి 1 గంట వరకు నడపనున్నట్లు వెల్లడించింది. 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై 7 వ తేదీ మధ్యరాత్రి 1 గంట వరకు మెట్రో సేవలు కొనసాగనున్నాయి. గణపయ్య భక్తులకు ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ఖైరతాబాద్ మహా గణపతిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో సీఎం రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు అర్చకులు.. సీఎం రేవంత్ ఖైరతాబాద్ మహా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాల సందర్బంగా ప్రజలందరికి శుభాకాంక్షలు.. దేశంలోనే గణేష్ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి.. ఖైరతాబాద్ గణేశుని కి ప్రత్యేకత ప్రాధాన్యత ఉంది.. 1 లక్ష నలభై వేల విగ్రహాలు ఈ సారి నగరంలో ప్రతిష్టించారు.. […]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. రామాలయం సమీపంలోని ప్రైవేట్ లాడ్జిలో పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లాడ్జి సిబ్బంది వారిని వెంటనే భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి యువకుడు మృతిచెందాడు. యువతీ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. మృతుడు వెస్ట్ గోదావరి జిల్లా కి చెందిన నడిపింటి రవి(35)గా గుర్తించారు. చికిత్స పొందుతున్న యువతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం […]
ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా భారత్ లో తన మొదటి డెలివరీని ప్రారంభించింది. టెస్లా జూలై 15న తన ఎలక్ట్రిక్ మిడ్‌సైజ్ SUV, టెస్లా మోడల్ Yని విడుదల చేయడంతో భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీని ధర సుమారు రూ. 60 లక్షలు. జూలై 15న ప్రారంభించబడిన ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ‘టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్’లో మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ వైట్ కలర్ మోడల్ Y కారును డెలివరీ తీసుకుంటున్నట్లు […]
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ గణపతి హోమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సతీమణి శోభతో కలిసి మద్యాహ్నం 12 గంటలకు కేసీఆర్ పూజలో పాల్గొననున్నారు. ప్రతి ఏటా వినాయకచవితి నవరాత్రులలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విజ్ఞాలు తొలగాలని కేసీఆర్ పూజలు చేయనున్నారు. ఐదు రోజులుగా ఎర్రవల్లి ఫాంహౌస్ లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్ కు పలువురు బీఆర్ఎస్ నాయకులు చేరుకున్నారు. Also Read:PVN […]
ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ మరో కొత్త గృహోపకరణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త బెస్పోక్ ఏఐ వాషింగ్ మెషీన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ యంత్రం 12 కిలోల వాష్, 7 కిలోల డ్రై కెపాసిటీతో వస్తుంది. ఈ ఉపకరణం నో-లోడ్ ట్రాన్స్ఫర్, ఆల్-వెదర్ డ్రైయింగ్, ఇంటెలిజెంట్ ఫాబ్రిక్ కేర్‌తో వస్తుంది. బెస్పోక్ AI వాషర్-డ్రైయర్ అద్భుతమైన పనితీరును అందిస్తుందని, విద్యుత్తును కూడా ఆదా చేస్తుందని, ఇది పట్టణ గృహాలకు మంచి ఎంపికగా మారుతుందని కంపెనీ […]
నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ షాకిచ్చాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 760 పెరిగింది. దీంతో తులం పసిడి ధర రూ. లక్షా ఏడు వేలు దాటింది కిలో సిల్వర్ ధర రూ. 100 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,762, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,865 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 […]
కొన్ని ప్రేమలు పెళ్లి పీటలెక్కుతుంటే.. మరికొన్ని ప్రేమలు కాటికి చేరుతున్నాయి. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో తనువులు చాలిస్తున్నారు కొందరు యువతీ యువకులు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అన్న వరస అవుతాడని ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. ప్రేమను వదులుకోలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. Also Read:Sri Lanka: శ్రీలంకలో ఘోర విషాదం.. లోయలో పడ్డ బస్సు.. 15 మంది […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకున్నారు. జపాన్ పై సుంకం 25 నుంచి 15 శాతానికి తగ్గించారు. జపాన్ వాహనాలు, ఇతర ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని ఆదేశించారు. ఈ నిర్ణయం జూలైలో కుదిరిన ఒప్పందం అమలులో భాగం. అమెరికా, జపాన్ మధ్య నెలల తరబడి జరిగిన చర్చల ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం జపాన్ ఆటో పరిశ్రమకు ఉపశమనం కలిగించడమే కాకుండా, అమెరికాలో జపాన్ $550 బిలియన్ల పెట్టుబడికి మార్గం సుగమం […]