-
Hyderabad: ఇంట్లో చోరీకి గురైన బంగారు ఆభరణాలు దొరకలేదని.. కొడుకుతో సహా తల్లి..
ఇటీవలి కాలంలో చిన్న చిన్న విషయాలకే మానసిక వేధనకు గురై షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే తరహాలో ఓ వివాహిత ఇంట్లో చోరీకి గురైన బంగారు ఆభరణాలు దొరకలేదని తీవ్ర మనస్థాపానికి గురైంది. కొడుకుతో సహా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటన వనస్థలిపురంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చింతల్‌కుంటకు చెందిన సుధేష్ణకు(28) నాలుగేళ్ల కిందట అమ్మదయ కాలనీకి చెందిన నోముల ఆశీష్ కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు ఆరుష్‌కుమార్ ఉన్నాడు. […] -
Hyderabad: పెళ్లి పేరుతో మోసం.. బంజారాహిల్స్ లో లేడీ డాక్టర్ పై మరో వైద్యుడి లైంగిక దాడి
ప్రేమ, పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. ఇదే రీతిలో ఓ వైద్యుడు లేడీ డాక్టర్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచించాడు. తన కోరిక తీర్చుకున్నాక వివాహానికి నిరాకరించాడు. మోసపోయానని గ్రహించిన మహిళా వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లేడీ డాక్టర్ హైదరాబాద్ లోని నిలోఫర్ హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తోంది. మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ స్వామి పనిచేస్తున్నాడు. Also Read:Heavy Rain Forecast: […] -
Hyderabad: హైదరాబాద్ నుంచి ఫ్రాంక్ ఫోర్ట్ వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో 160 మంది ప్రయాణికులు
విమాన ప్రయాణికులకు ఇటీవల చోటుచేసుకుంటున్న ఫ్లైట్ ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తృటిలో మరో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఫ్రాంక్ ఫోర్ట్ వెళ్తున్న లుఫ్తాన్స విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. విమానంలోని ముందు టైరులో సాంకేతిక లోపాన్ని గుర్తించాడు పైలెట్. వెంటనే పైలట్ విమానాన్ని రన్ వే పై దించేశాడు. ఈ సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఘోర ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం […] -
Hyderabad: హయత్ నగర్ లో డీసిఎంను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
హయత్ నగర్ కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు డీసీఎంను ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు నుజ్జు నుజ్జైంది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో హాస్పిటల్ కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు చంద్రసేనారెడ్డి, త్రినాద్ రెడ్డి, వర్షిత్ రెడ్డిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృత దేహాలు […] -
Devanand: ఇది కదా సక్సెస్ అంటే.. మృత్యువును జయించి.. నేడు ఐఎఫ్ఎస్ అధికారిగా
శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అని చెప్పిన స్వామీ వివేకానందా మాటలను నిజం చేశాడు ఆ యువకుడు. తన లక్ష్యం పట్ల అంకితభావం, టార్గెట్ చేధించేందుకు తను చేసిన కృషి నేడు ఆయనను దేశ అత్యున్నత సర్వీసు అయిన ఐఎఫ్ఎస్ అధికారిని చేశాయి. మరణం అంచుల వరకు వెళ్లిన అతడు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్‌లో 112వ ర్యాంకును సాధించారు. అతను మరెవరో కాదు దేవానంద్ టెల్గోట్. ఇతడు మహారాష్ట్రకు చెందిన […] -
Maruti Suzuki Fronx: ఆటోమేటిక్ వేరియంట్ కారు కోసం చూస్తున్నారా?.. రూ. 2 లక్షలు ఉంటే చాలు!
కొత్త కారు కొనాలని భావిస్తున్నారా? అయితే రూ. 2 లక్షలు ఉంటే చాలు మీ కలను తీర్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి ఫ్రాంక్స్ తయారీదారుచే కాంపాక్ట్ SUV విభాగంలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికతో మారుతి సుజుకి ఫ్రాంక్స్ అందుబాటులో ఉంది. మీరు ఈ SUV ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేసి ఇంటికి తెచ్చుకోవచ్చు. నెలకు ఎంత EMI చెల్లించాలంటే? […] -
Health Tips: ఈ ఆహారపు అలవాట్లు కిడ్నీల్లో రాళ్లకు కారణం.. ఈ తప్పులు అస్సలు చేయకండి
ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటాయి. ఆహార పదార్థాలు పలు అవయవాల క్షీణతకు దారితీస్తుంటాయి. ముఖ్యంగా కిడ్నీలు, వాటిల్లో రాళ్లు చేరడం ఇటీవలి కాలంలో ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. మన శరీరంలో కిడ్నీలు అతి ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తాన్ని శుభ్రపరిచి.. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. అయితే కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు, మన అలవాట్ల వల్ల.. కిడ్నీల్లో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి.. గట్టిపడి రాళ్లుగా మారతాయి. కిడ్నీలో రాళ్లు ఉంటే.. చాలా […] -
Abhishek Sharma: నిప్పుతో ఆటలొద్దురోయ్.. అక్కడ ఉంది యువరాజ్ శిష్యుడు
నిన్న లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాట్ కమ్మిన్స్ నాయకత్వంలోని SRH 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, లక్నోని ప్లేఆప్స్ నుంచి బయటకు వెళ్లగొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో లక్నో బౌలర్ కాస్త అతి చేశాడు. ఏకంగా యువరాజ్ సింగ్ శిష్యుడు అభిషేక్ శర్మతోనే పెట్టుకున్నాడు. దిగ్వేష్ రాఠి వేసిన ఎనిమిదో ఓవర్ మూడో బంతిని అభిషేక్ శర్మ కవర్ మీదుగా షాట్ కు […] -
Deepfake: డీప్‌ఫేక్ పో*ర్న్పై చట్టం.. బిల్లుపై డోనాల్డ్ ట్రంప్ సంతకం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డీప్‌ఫేక్, రివెంజ్ పోర్న్‌లపై ఉక్కుపాదం మోపారు. వీటి కట్టడికి చట్టం చేశారు. ట్రంప్ బిల్లుపై సంతకం చేశారు. ఈ చట్టం పేరు టేక్ ఇట్ డౌన్ యాక్ట్. ఈ చట్టం అమల్లోకి వస్తే ఎవరైన వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తి అనుమతి లేకుండా AI జనరేటెడ్ అశ్లీల చిత్రాన్ని ఆన్లైన్లో పోస్ట్ చేస్తే, అప్పుడు టెక్నాలజీ కంపెనీలు 48 గంటల్లోపు ఆ కంటెంట్‌ను తొలగించాల్సి ఉంటుంది. మన పిల్లలు, మన కుటుంబాలు, […] -
IPL 2025: తిక్కకుదిరింది.. గ్రౌండ్ లో గొడవ.. దిగ్వేష్ రాఠి-అభిషేక్ శర్మపై బీసీసీఐ చర్యలు
లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన IPL 2025 మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో దిగ్వేష్ సింగ్ రాఠి అభిషేక్ శర్మతో వాగ్వాదానికి దిగాడు. వీరిద్దరి వ్యవహారంపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. BCCI (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఇద్దరు ఆటగాళ్లపై చర్యలు తీసుకుంది.ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు దిగ్వేష్ రాఠిపై ఒక మ్యాచ్ నిషేధం, 50% జరిమానా విధించింది. అభిషేక్ శర్మకు మ్యాచ్ ఫీజులో 25% […]
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!