కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే ఈ జాబ్స్ మీకోసమే. గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ట్రైనీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 47 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి BE/B.Tech/B.Sc (Eng.)/IDDలో రెగ్యులర్ డిగ్రీని కలిగి ఉండాలి. గేట్ 2025 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (EE) పేపర్‌లో అర్హత సాధించాలి. అభ్యర్థుల వయసు జూలై 31, 2025 నాటికి 28 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉండాలి.
ఎంపిక ప్రక్రియలో GATE-2025 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (EE) పేపర్‌లో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. తరువాత గ్రూప్ డిస్కషన్ (GD), పర్సనల్ ఇంటర్వ్యూ (PI) ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులను E2 స్థాయిలో తీసుకుంటారు. వీరికి రూ. 50000-160000 IDA జీతం లభిస్తుంది. అప్లికేషన్ ప్రక్రియ ఏప్రిల్ 1నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 30 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈలింక్ పై క్లిక్ చేయండి.