టీవీఎస్ కంపెనీ దేశంలో మొట్టమొదటి సీఎన్జీ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అత్యంత పాపులారిటీ పొందిన టీవీఎస్ జూపిటర్ ను సీఎన్జీలో తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. సీఎన్జీ వాహనాలకు పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా, ఈ స్కూటర్‌ను తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ టీవీఎస్ జూపిటర్ సీఎన్జీ 226 కిలోమీటర్ల వరకు అద్భుతమైన మైలేజీని ఇస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం పెట్రోల్ ఖర్చులతో ఇబ్బంది పడుతున్న వారికి సీఎన్జీ వాహనాలతో డబ్బు ఆదా కావడం పక్కా అంటున్నారు మార్కెట్ […]
టెక్నాలజీ కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. ఆటో మొబైల్ ఇండస్ట్రీలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టెక్నాలజీని అందిపుచ్చుకుని డ్రైవర్ లెస్ కార్లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. విప్రో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), బెంగళూరులోని RV కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సంయుక్తంగా భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ డ్రైవర్‌లెస్ కారు నమూనాను ఆవిష్కరించాయి. దీనికి WIRIN (Wipro-IISc రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ నెట్వర్క్) అని పేరు పెట్టారు. ఈ కారు పూర్తిగా భారత్ లో అభివృద్ధి చేయబడిన టెక్నాలజీపై […]
ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను ప్రకటించింది. అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతాయని గమనించాలి. నవంబర్ లో మొత్తం 12 బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. ఈ సెలవుల్లో ప్రభుత్వ సెలవులు, అలాగే రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు ఉన్నాయి. ఈ సెలవు రోజుల్లో కూడా ATM, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ […]
ఎలోన్ మస్క్ కంపెనీ స్టార్ లింక్ భారత్ లోకి అడుగుపెట్టింది. దేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్ను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ముంబైలోని అంధేరి తూర్పు ప్రాంతంలో 1,294 చదరపు అడుగుల కార్యాలయాన్ని స్టార్ లింక్ ఐదు సంవత్సరాల పాటు అద్దెకు తీసుకుంది. కంపెనీ ముంబైలో శాటిలైట్ ఇంటర్నెట్ ట్రయల్ నిర్వహిస్తోంది, స్టార్ లింక్ టెక్నాలజీని ప్రజలకు VIPలకు పరిచయం చేస్తోంది. నివేదికల ప్రకారం, ముంబైని కేంద్రంగా దేశవ్యాప్తంగా పనిచేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఇటీవల, లక్నో, నోయిడా, […]
రేపటితో అక్టోబర్ నెల ముగియబోతోంది. ఎల్లుండి నుంచి అంటే శనివారం నుంచి నవంబర్ నెల ప్రారంభంకాబోతోంది. కాగా ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. నవంబర్ 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా అనేక ప్రధాన మార్పులు జరగనున్నాయి. ఈ మార్పులు సామాన్యుల జేబుపై ప్రభావం చూపుతాయి. ఈ మార్పులలో క్రెడిట్ కార్డుల నుంచి LPG వరకు నిబంధనలలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆధార్ అప్డేట్ నుంచి LPG, క్రెడిట్ కార్డ్ వరకు […]
సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో అమాయకులను మోసం చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇటీవల డిజిటల్ అరెస్టుల పేరుతో రెచ్చిపోతున్నారు. తాజాగా పూణేలో ఓ రిటైర్డ్ అధికారిని డిజిటల్ అరెస్టు పేరుతో మోసం చేసి ఏఖంగా రూ. 1.19 కోట్లు కాజేశారు. తన జీవిత కాలంలో దాచుకున్న సొమ్ము మొత్తాన్ని కొల్లగొట్టారు. సైబర్ క్రిమినల్స్ వేధింపులు, ఆర్థిక నష్టం ఒత్తిడి కారణంగా బాధితుడు అక్టోబర్ 22న ఇంట్లో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో మరణించినట్లు […]
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 110 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా, ఇతర నిర్దేశిత అర్హతలను కలిగి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు […]
మొన్నటి వరకు పండగ సీజన్ కాబట్టి స్మార్ట్ ఫోన్లు, గాడ్జెట్స్ పై కళ్లు చెదిరే ఆఫర్లు ప్రకటించాయి ఈ కామర్స్ సంస్థలు. వేలకు వేలు డిస్కౌంట్ ప్రకటించాయి. అయితే ఫెస్టివల్ సేల్ ముగిసిపోయింది. అయినప్పటికి సామ్ సంగ్ వంటి బ్రాండ్ల నుండి ఫోన్లు ఇప్పటికీ చాలా చౌక ధరలకు అందుబాటులో ఉన్నాయి. S సిరీస్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్లలో ఒకటైన గెలాక్సీ S25 అల్ట్రాపై క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒకటైన Samsung […]
ఢిల్లీ ప్రభుత్వం వాహనదారులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఆ రోజు నుంచి ఆ వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. ఢిల్లీలోని కాలుష్యం ఊపిరాడకుండా చేస్తోంది. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే నవంబర్ 1 నుండి, BS-VI నిబంధనలకు అనుగుణంగా లేని అన్ని కమర్షియల్ వాహనాలను ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని ప్రభుత్వం నిషేధిస్తుంది. ఈ ఉత్తర్వును కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) జారీ చేసింది. ముఖ్యంగా శీతాకాలంలో కాలుష్య […]
డాక్టర్లను దేవుళ్లతో సమానంగా చూస్తారు. కానీ ఓ రోగిని ప్రేమించలేని డాక్టర్ రోగితో సమానం. ఇదే విధంగా ప్రవర్తించింది ఓ లేడీ డాక్టర్. ఓ వ్యక్తి అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లితే.. వైద్యం చేయాల్సింది పోయి ఆ వ్యక్తిపై మహిళా వైద్యురాలు దురుసుగా ప్రవర్తించింది. ఏకంగా చెంప చెల్లుమనిపించి తన కోపాన్ని వెల్లగక్కింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ సోలా సివిల్ హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. ఇది చూసిన […]