గూగుల్ మ్యాప్స్ ఒక తెలియని ప్రాంతానికి వెళ్లడానికి దారి తెలుసుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. నేటి డిజిటల్ యుగంలో, ప్రయాణ ప్రణాళిక నుంచి దిశలు, ట్రాఫిక్ అప్ డేట్స్ తెలుసుకోవడం వరకు ప్రతిదానికీ సహాయపడే సాధనంగా గూగుల్ మ్యాప్స్ మారింది. గూగుల్ మ్యాప్స్ అనేది ఒక శక్తివంతమైన నావిగేషన్ సాధనం. ఆఫీసుకు వెళ్లే మార్గాన్ని తెలుసుకోవాలన్నా లేదా హైదరాబాద్ నుంచి ముంబైకి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలన్నా, Google Maps కొన్ని సెకన్లలో దూరం, సమయం, మార్గాన్ని తెలియజేస్తుంది. […]
పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, అదానీ గ్రూప్ ఛత్తీస్‌గఢ్‌లో మైనింగ్ లాజిస్టిక్స్ కోసం భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ట్రక్కును విడుదల చేసింది. 40 టన్నుల వరకు వస్తువులను మోసుకెళ్లగల ఈ ట్రక్కును ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి రాయ్‌పూర్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ ట్రక్కును గారే పాల్మా బ్లాక్ నుంచి రాష్ట్ర విద్యుత్ ప్లాంట్‌కు బొగ్గు రవాణా చేయడానికి ఉపయోగిస్తారని చెబుతున్నారు. Also Read:Jagdish Devda : ‘‘ప్రజలు, సైన్యం మోడీ పాదాలకు నమస్కరించాలి’’.. […]
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి రోజు వ్యాయామం, పోషకాహారం తీసుకోవాలని సూచిస్తుంటారు వైద్య నిపుణులు. ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఏది పడితే అది ఎంత పడితే అంత కాకుండా పద్దతిగా తినడం అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఊదలు, అండు కొర్ర, అరికెలు, సామలు వంటి చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటున్నారు. చిరుధాన్యాలు విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్, ఫైబర్ లాంటి పోషకాలను కలిగి ఉంటాయి. చిరుధాన్యాలను తినడం […]
ఇటీవల మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. కొన్ని రోజుల క్రితం తమ బంధువుల అబ్బాయికి ఉద్యోగం కావాలని మంత్రి శ్రీధర్ బాబును కోరడం ఆ వ్యాఖ్యలు కాస్త వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు మంత్రులు కమిషన్ తీసుకుంటారు అనే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మంత్రుల దగ్గర ఏ పని జరగాలన్నా.. ఏ ఫైల్ కదలాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. […]
ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ జాబ్స్ మీకోసమే. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), స్పోర్ట్స్ కోటా (హాకీ) నుంచి హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 30 పోస్టులను భర్తీచేయనున్నారు. ఇది ఇంటర్మీడియట్ అర్హతతో పాటు క్రీడా ప్రతిభ గల మహిళలకు సువర్ణావకాశం. Also Read:TVS iQube S, ST […]
ఈ మధ్య కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లపై మే 2025లో బంపర్ డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో టాటా కర్వ్ EV, పంచ్ EV, నెక్సాన్ EV, టియాగో EV ఉన్నాయి. టాటా మోటార్స్ EV శ్రేణిపై రూ.1.86 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా టాటా మోటార్స్ రూ. 50,000 వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాన్ని అందిస్తోంది. అలాగే […]
గంజాయి, మాదకద్రవ్యాల కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు అమలు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో అడ్డుకట్టపడడం లేదు. మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గంజాయి మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా విజయవాడ బస్టాండ్ లో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది. శ్రీశైలం పవర్ ప్లాంట్ లో విధులు నిర్వహిస్తున్న అసిస్టంట్ సెక్రటరీ కృష్ణారావు పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. Also Read:Rajnath Singh: పాక్ వద్ద అణ్వాయుధాలు సురక్షితమా..? అంతర్జాతీయ జోక్యం అవసరం..! […]
ఇటీవల ఒంగోలులో దారుణహత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈ ఉదయం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులోని వీరయ్య చౌదరి నివాసానికి వెళ్లిన మంత్రి లోకేష్.. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి సతీమణి, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వీరయ్య చౌదరితో తనకున్న అనుబంధాన్ని […]
టీమిండియా ప్రమాదంలో పడనుందా..? యంగ్ స్టార్స్ భారత్ ను ముందుకు తీసుకెళ్లగలరా? రెండు దశాబ్దాలుగా ఎదురులేని భారత్ ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ ముందు ఎందుకు బలహీనంగా కనిపిస్తుంది. దీనికి ఎవరు కారణం? గంభీర్ నిర్ణయాలు కొంపముంచుతున్నాయా? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలెన్నో తలెత్తుతున్నాయి. కోహ్లీ, రోహిత్ తప్పుకోవడంతో రెడ్ బాల్ క్రికెట్ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ, రోహిత్ దశాబ్దకాలం పాటు టెస్ట్ క్రికెట్ ను కాపాడుతూ వచ్చారు. టెస్టుల్లో కోహ్లీ నాయకత్వంలో భారత్ చాలా కాలం పాటు […]
నేడు కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. “అమైకస్ క్యూరీ” గా పరమేశ్వరన్ వ్యవహరించారు. విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ తెలంగాణ ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారంగా డజన్ల కొద్ది బుల్డోజర్లు చెట్లను తొలగించేందుకు ఉపయోగించారని మండిపడ్డారు. ఇదంతా ముందస్తు పథకం […]