ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో మరో కొత్తది వచ్చి చేరింది. కైనెటిక్ గ్రీన్ కంపెనీ భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కైనెటిక్ DXని విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కంపెనీ క్రేజీ ఫీచర్లను అందించారు. ఇందులో 8.8 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్పీకర్లు, వాయిస్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, కైనెటిక్ అసిస్ట్, 748 ఎంఎం సీటు, 37 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, హిల్ హోల్డ్, రివర్స్ మోడ్, రీజెనరేటివ్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్, ఈజీ ఛార్జర్, ఈజీ కీ, ఈజీ ఫ్లిప్, 16 భాషలు వంటి ఫీచర్లు ఉన్నాయి.
Also Read:AR Rahman : హైదరాబాద్‌లో రెహమాన్ కన్సర్ట్.. పాట వినాలంటే పర్సు ఖాళీ కావాల్సిందే!
కైనెటిక్ గ్రీన్ విడుదల చేసిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 2.6 kWh LFP బ్యాటరీని కలిగి ఉంది. దీనిని నాలుగు గంటల్లో 0-100 శాతం ఛార్జ్ చేయవచ్చు. సింగిల్ ఛార్జ్ తో 116 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. దీనిలో అమర్చిన హబ్ మోటార్ నుంచి శక్తి లభిస్తుంది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది. రైడింగ్ కోసం మూడు మోడ్‌లు అందించారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.11 లక్షలు (కైనెటిక్ EV ధర), టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.17 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.