నిన్న ఆపరేషన్ సిందూర్ పై జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత, ప్రధాని మోడీ ఈరోజు తెల్లవారుజామున పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. ప్రధాని మోడీ ఈరోజు ఉదయం 7 గంటలకు ఢిల్లీలోని పాలం విమానాశ్రయం నుంచి బయలుదేరి పంజాబ్‌లోని జలంధర్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న వాయుసేన సిబ్బందితో ప్రధాని సమావేశం అయ్యారు. ప్రధాని మోదీ వైమానిక దళ సిబ్బందిని కలిసి వారి మనోధైర్యాన్ని పెంచడానికి కృషి చేశారు. పాకిస్తాన్‌కు ఇండియా ఎయిర్‌ఫోర్స్ […]
ఆపరేషన్ సిందూర్ కింద సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై చర్య తీసుకున్న తర్వాత, భద్రతా దళాలు ఇప్పుడు సరిహద్దు లోపల అంటే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సైనిక చర్యను ముమ్మరం చేశాయి. షోపియన్తో సహా వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం సైన్యం గాలింపు చర్యలు చేపడుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు అడవిలో లష్కరే తోయిబా ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు […]
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సంజీవ్ ఖన్నా మే 13, (మంగళవారం)న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన స్థానంలో సీనియర్ న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ (BR) గవాయి నియమితులవుతారు. రేపు భారత 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు జస్టిస్ బి.ఆర్ గవాయి. రేపు ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ప్రమాణస్వీకారం చేయనున్నారు జస్టిస్ బిఆర్ గవాయ్. ప్రెసిడెంట్ […]
క్రీడాప్రపంచంలో కింగ్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ ప్రస్థానం ముగిసింది. కేవలం 36 ఏళ్ళ వయసులో కోహ్లీ తన రిటైర్మెంట్ ని ప్రకటించాడు. ఇప్పటికే రోహిత్ తప్పుకోగా.. త్వరలో మరో కీలక ఆటగాడు కూడా టెస్టుల నుంచి వైదొలగనున్నాడు. ఇలా వరుసగా ఒక్కొక్కరు తప్పుకుంటుండగా అది ఫ్యాన్స్ కు మింగుడుపడటం లేదు. కానీ వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలను మనం గౌరవించాల్సిందే. సుదీర్ఘ ఫార్మెట్లో దశాబ్దానికి పైగా ఆడి, రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక వాళ్ళకీ బాధ ఉంటుంది. రిటైర్మెంట్ నిర్ణయం […]
భారత్ పహల్గాం టెర్రర్ ఎటాక్ కు ప్రతీకారంగా పాక్ కు తగిన బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ను గడగడలాడించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ పై మరింత ఒత్తిడి తెచ్చేందుకు రెడీ అయ్యింది. ద్వైపాక్షిక ఒత్తిడి తెచ్చేందుకు నేడు పలు దేశాల సైనిక రాయబారులకు కేంద్రం ప్రత్యేక బ్రీఫింగ్ ఇవ్వనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు త్రివిధ దళాల డైరెక్టర్ జనరల్స్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, […]
పంజాబ్ లోని అమృత్‌సర్‌లో కల్తీ మద్యం కలకలం రేపింది. కల్తీ మద్యం తాగి ఏకంగా14 మంది మృతి చెందారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో భంగలి కలాన్, మార్డి కలాన్, జయంతిపూర్ గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. Also Read:Gold Rates: షాక్ ఇచ్చిన పసిడి ధరలు.. నేడు […]
పసిడి ధరలు ఓ రోజు పెరుగుతూ మరో రోజు తగ్గుతూ కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. ఇవాళ స్వల్పంగా పెరిగింది. తులం గోల్డ్ పై రూ. 160 పెరిగింది. బంగారం ధరలు పెరగగా వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు కిలో వెండిపై రూ. 1000 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9, 562, 22 క్యారెట్ల బంగారం ధర […]
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ మరోసారి దాడులకు యత్నిస్తోంది. దీంతో ఉత్తరాదిన టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇండిగో, ఎయిర్ ఇండియా మే 13 నుంచి ఉత్తర, పశ్చిమ భారత్ లోని అనేక నగరాలకు విమాన సర్వీసులను నిలిపివేశాయి. శ్రీనగర్, జమ్మూ, అమృత్ సర్, లేహ్, చండీగఢ్, రాజ్కోట్లకు వెళ్లే అన్ని విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఇది మీ ప్రయాణ ప్రణాళికలకు ఎలా అంతరాయం కలిగిస్తుందో మేము […]
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత, భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ అనే పేరు ప్రజలకు బాగా నచ్చుతోంది. వారు తమ కూతుళ్లకు సింధూర్ అని పేరు పెడుతున్నారు. దేశ భక్తిని చాటుకుంటున్నారు తల్లిదండ్రులు. కుషినగర్ జిల్లాలో, మే 7 తర్వాత ఓ హాస్పిటల్ లో రెండు రోజుల్లో జన్మించిన 17 మంది బాలికలకు వారి తల్లిదండ్రులు సింధూర్ అని పేరు పెట్టారు. దేశంలోని త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ […]
అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు. ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొని వంతెనపై నుంచి కింద పడిపోయిన ప్రమాదంలో మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. తీవ్రగాయాల కారణంగా అక్కడికక్కడే మరణించారని తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనం ముందు సీటులో ఉన్న మరో ప్రయాణీకుడు గాయపడ్డాడని, అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. Also Read:LRS Scheme: మే 31 వరకు ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగించిన […]