గోల్డ్ లవర్స్ కు బిగ్ షాక్. నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజులోనే తులం గోల్డ్ ధర రూ. 660 పెరిగింది. వెండి కూడా బంగారం బాటలోనే పయణించింది. కిలో సిల్వర్ పై రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,048, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,210 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 600 పెరిగింది. దీంతో రూ.92,100 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 660 పెరిగింది. దీంతో రూ. 1,00,480 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Pawan Kalyan : కంగనా రనౌత్ పై పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్..
విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,250 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,00,630 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,27,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,17,000 వద్ద ట్రేడ్ అవుతోంది.