పీజేఆర్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “20 నుంచి 25 ఏళ్లు నగరంలో పీజేఆర్ శకం నడిచింది.. ఇతర ప్రాంతాల నుంచి బ్రతుకు దెరువుకు వచ్చిన వారిపై ఎవరైనా దౌర్జన్యం చేసినా పీజేఆర్ అడ్డుకునేవారు.. పిలిస్తే పలికే నాయకుడు పీజేఆర్.. మంత్రిగా నిరంతరం సేవ చేస్తూ.. పేదవారికి అండగా నిలబడ్డాడు.. సీఎల్పీ నాయకుడిగా కూడా పీజేఆర్ ఎనలేని సేవ చేశాడు.. పీజేఆర్ ఇల్లు ప్రజల సమస్యలు తీర్చేందుకు […]
మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మెట్ పల్లి మండలం అరపేట్ శివారులో మంత్రి ప్రయాణిస్తున్న కారు ముందు చక్రాలు ఊడిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మెట్ పల్లి పర్యటన ముగించుకుని ధర్మపురి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఏమి కాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరో వాహనంలో వెళ్లిపోయారు. కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నరసింగరావు.. కోరుట్ల డిఎస్పీ.. ప్రమాద స్థలాన్ని […]
మరో రెండ్రోజుల్లో జూన్ నెల ముగిసి జూలై నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. జూలై నెల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. జూలైలో భారీగా బ్యాంక్ సెలవులు ఉండనున్నాయి. జూలై నెలలో 13 రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి. ఇందులో రెండవ, నాల్గవ శనివారాలు అలాగే ఆదివారం సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవులు ప్రాంతాలను బట్టీ మారుతూ ఉంటాయని గుర్తుంచుకోవాలి. […]
లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్-బెంజ్ కొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఈవీలకు పెరుగుతున్న ఆదరణ దృష్టిలో ఉంచుకుని క్రేజీ ఫీచర్లతో ఈవీ కారును పరిచయం చేసింది. కంపెనీ హై-పెర్ఫార్మెన్స్ డివిజన్ AMG కింద ఒక ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ కారు పేరు మెర్సిడెస్ AMG GT-XX కాన్సెప్ట్. మెర్సిడెస్ AMG GT-XX కాన్సెప్ట్ కారును హీరో-ఆరెంజ్ షేడ్లో ప్రదర్శించారు. ఇది 60, 70ల నాటి C111 కాన్సెప్ట్ కార్లు, […]
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మానవ అక్రమ రవాణా కలకలం రేపుతోంది. ఇటీవల కొమురం భీమ్ జిల్లాలో మానవ అక్రమ రవాణా కేసులో 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో మానవ అక్రమ రవాణా కేసు నమోదైంది. ఓ మైనర్ బాలికను అమ్మేసిన వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. అమ్మాయిని పక్క రాష్ట్రానికి అమ్మిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మానవ అక్రమ రవాణా ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్తాన్ కోటా ఏరియాలో ముఠా […]
థామ్సన్ భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ టీవీని విడుదల చేసింది. కంపెనీ 43 అంగుళాల QLED టీవీని విడుదల చేసింది. ఈ టీవీ బెజెల్-లెస్ డిజైన్, మెటాలిక్ ఫినిషింగ్తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10, డాల్బీ డిజిటల్ ప్లస్ లకు మద్దతు ఇచ్చే QLED 4K డిస్ప్లేతో వస్తుంది. ఈ టీవీలో 2GB RAM, 16GB స్టోరేజ్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ ఉన్నాయి. థామ్సన్ 43-అంగుళాల QLED టీవీ ధర రూ. 21,499. […]
మిడ్ రేంజ్ బడ్జెట్లో కొత్త స్మార్ట్ కోసం చూస్తున్నారా? అయితే ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. భారత్ లో Samsung Galaxy M36 లాంచ్ అయింది. కంపెనీ ఈ స్మార్ట్ఫోన్ను ఎంట్రీ లెవల్ మిడ్ రేంజ్ బడ్జెట్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ 20 వేల రూపాయల కంటే తక్కువ బడ్జెట్లో వస్తుంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ + ఉంది. ఈ ఫోన్లో 50MP […]
నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రేవంత్ సర్కార్ కృషి చేస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1,2,3, డీఎస్సీ ల ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టగా తాజాగా ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యింది. హెల్త్ డిపార్ట్ మెంట్ లో మరోసారి భారీగా జాబ్స్ భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆరోగ్యశాఖలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి […]
టీజీఈఏపీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ రిలీజ్ చేసింది. మూడు విడతల్లో ఈఏపీసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మొదటి విడత కౌన్సిలింగ్ కి జూన్ 28 నుంచి జులై 7వ తేదీ వరకు స్లాట్ బుక్ కింగ్ కి అవకాశం ఇచ్చారు. కాగా ఈ ఏడాది ఎప్ సెట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ విధానం లో మార్పులు తీసుకొచ్చారు. ఒరిజినల్ సీట్స్ అలాట్మెంట్ కన్నా ముందు మాక్ సీట్ అలాట్మెంట్ (అవగాహనా కోసమే […]
మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే రోజూవారి జీవితంపై ప్రభావం చూపిస్తుంది. జీవనశైలి సరిగా లేకపోవడం, ఒత్తిడి పెరగడం, అనారోగ్యకరమైన ఆహార ప్రణాళిక వంటి అంశాలు మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇది మనం ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాము, ఇతరులతో మంచి సంబంధాలు, నిర్ణయాలు తీసుకోవడం వంటి విషయాలను ప్రభావితం చేస్తుంది. మానసిక అనారోగ్యం అనేది ఆందోళన, నిరాశ, స్కిజోఫ్రీనియా, లేదా బైపోలార్ డిజార్డర్ వంటి పరిస్థితులను కలిగి ఉంటుంది. మానసిక అనారోగ్యానికి గురైతే నిరంతర ఆందోళన, […]