తిరుపతిలో ఓ కారులో డెడ్ బాడీలు కలకలం రేపాయి. తిరుచానూరు రంగనాధం వీధీలో ఓ కారులో ఇద్దరు యువకుల మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలిసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారులో బీర్లు తాగి మత్తులో అలానే నిద్రించడంతో ఊపిరి ఆడక మృతి చెందారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువకుల మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కారులో నాలుగు బీరు బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. వినయ్, దీలీప్ అనే ఇద్దరు యువకుల మృతదేహాలను […]
బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నేడు తులం బంగారంపై రూ. 160 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,726, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,915 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గింది. దీంతో రూ.89,150 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. […]
ఆదోని పట్టణంలోని 34 వ వార్డు సచివాలయ మహిళ పోలీసుగా దివ్య (26) విధులు నిర్వహిస్తోంది. కాగా దివ్య ఈ నెల 15న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సిజేరియన్ కాన్పు కావడంతో అనారోగ్యానికి గురైంది. 15 రోజులు గడవకముందే దివ్య ప్రాణాలు కోల్పోయింది. దివ్య మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే దివ్య మృతికి బదిలీల కౌన్సెలింగ్లో తీవ్ర జాప్యం జరగడమే కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Also Read:Regina Cassandra : సొగసుల వల […]
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం దొమ్మన్న బావి వద్ద టెంపో ట్రావెల్ ను లారీ ఢీకొట్టింది. తిరుమల నుంచి కర్ణాటక బాగేపల్లి వెళ్తున్న టెంపో ట్రావెల్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన వారు చరణ్, మేఘర్ష్, శ్రావణి గా గుర్తించారు. డ్రైవర్ మంజునాథ్ తో సహా మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని మదనపల్లె […]
పెద్దలను ఒప్పించి లేదా ఎదిరించి అయినా సరే తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తుంటారు. ఇదే విధంగా ఓ యువతి తను ప్రేమించిన యువకుడిని పెళ్లాడింది. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని ఆమె తండ్రి ఎవరూ ఊహించని పనిచేశాడు. ప్రేమ పెళ్లి తర్వాత కూతురు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని తండ్రి తన కుమార్తెకు పుట్టిన మగ శిశువును కన్న తల్లికి తెలియకుండా వేరొకరికి దత్తత ఇచ్చాడు. అయితే […]
మాదాపూర్ సున్నం చెరువులోని ఆక్రమణలను వద్ద హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. సున్నం చెరువు పరిధిలో అక్రమంగా వెలిసిన గుడిసెలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను తొలగించేస్తున్నారు. చెవుల పునరుద్ధరణలో భాగంగా రూ. 10 కోట్లతో సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తోంది. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు వెలుగుచూశాయి. చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు […]
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో సహజీవనం చేస్తున్న జంట దారుణానికి పాల్పడింది. తమ ఇద్దరు నవజాత శిశువులను పుట్టిన వెంటనే పూడ్చిపెట్టింది. సంవత్సరాల తరువాత వారి అవశేషాలను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి లొంగిపోయారు. 25 ఏళ్ల భవిన్ పుతుక్కాడ్ పోలీస్ స్టేషన్కు చేరుకుని, ఇద్దరు నవజాత శిశువుల అవశేషాలను పోలీసులకు అప్పగించి తన నేరాన్ని అంగీకరించాడు.తాను, తన లివ్-ఇన్ పార్టనర్ అనిషా (22) పిల్లలు పుట్టిన వెంటనే వారిని పూడ్చిపెట్టినట్లు నిందితుడు అంగీకరించాడు. పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాకు హెచ్చరికలు జారీ చేశఆడు. ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కెనడా కొన్ని పన్నులను రద్దు చేసే వరకు అమెరికా, కెనడా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు ముందుకు సాగవని స్పష్టం చేశారు. కెనడాను “బ్యాడ్ బిహేవియర్” దేశంగా ఆయన అభివర్ణించారు. నేటి (సోమవారం) నుంచి అమల్లోకి రానున్న డిజిటల్ సర్వీసెస్ టాక్స్ (DST) కొన్ని పన్నులను తొలగించాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ పన్ను […]
భారత త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. మీరు ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నట్లైతే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. సైన్స్ సబ్జెక్టులతో 10+2 (ఇంటర్మీడియట్) విద్యార్థులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఎయిర్ సర్వీస్కు దరఖాస్తు చేసుకోవచ్చు. గణితం, భౌతిక శాస్త్రం, ఆంగ్లంలో ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 50% మొత్తం మార్కులు, ఇంగ్లీషులో […]
ప్రేమ కోసం చంపడానికైనా.. లేదా చావడానికైనా సిద్ధపడుతున్నారు నేటి రోజుల్లో. కొందరు యువతీ యువకులు ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విడిపోయి బ్రతకలేమని తనువులు చాలిస్తున్నారు. తాజాగా మరో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు సేవించి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. బీబీనగర్ (మ) కొండమడుగు రాగాల రిసార్ట్స్ లో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని […]