Veerababu Burugadda
Author- NTV Telugu-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఉబర్ దేశవ్యాప్తంగా తన సేవల విస్తరణలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా మరో 100 నగరాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించగా, ఇందులో తెలంగాణకు చెందిన 10 ముఖ్యమైన పట్టణాలు చోటు దక్కించుకున్నాయి. తెలంగాణలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలైన ఖమ్మం, నిజామాబాద్, రామగుండం, మహబూబ్‌నగర్, నల్లగొండ, కొత్తగూడెం, సిద్ధిపేట, కామారెడ్డి, సూర్యాపేట , ఆదిలాబాద్ పట్టణాల్లో ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈ విస్తరణ ద్వారా […] -
E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
ఢిల్లీలో E10 పెట్రోల్ లీటరు ధర రూ. 167.35 కాగా, E5 ధర రూ. 109.24, ప్రస్తుతం అందుబాటులో ఉన్న E20 పెట్రోల్ ధర రూ. 102.12గా ఉంది. అయితే దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్‌ను తప్పనిసరి చేసినప్పటి నుంచి, వాహనాల మైలేజ్, ఇంజిన్ లైఫ్ పై వాహనదారులు, ఆటోమొబైల్ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) అనంత నాగేశ్వరన్ ఒక […] -
Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
తెలంగాణలో రాగల కొన్ని గంటల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై వర్ష ప్రభావం […] -
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఒక కారు రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు జలసమాధి అయ్యారు. మృతులందరూ బలవంతపూర్ గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘోర ప్రమాదంలో బలవంతపూర్ వాసి రాజు (35), ఆయన భార్య భాగ్య (22), వారి ఐదేళ్ల కుమారుడు నియాన్ష్, మూడేళ్ల కుమార్తె శాన్విక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పూర్తి […] -
WTC Final: భారత్‌కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
శ్రీలంకలోని గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో 165 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించిన తర్వాత.. భారత జట్టు డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్‌కు చేరే అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 53.33 శాతం పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. అయితే ఫైనల్ రేసులో నిలవాలంటే కనీసం 60 శాతం మార్కును దాటడం అత్యవసరం. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ చరిత్రను పరిశీలిస్తే, 60 శాతానికి పైగా పాయింట్లు సాధించిన జట్లే పాయింట్ల పట్టికలో తొలి […] -
Indian Bowler: 10 వికెట్లతో శ్రీలంక నడ్డి విరిచిన భారత యువ బౌలర్.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం..
శ్రీలంకతో జరిగిన గాలే టెస్టులో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ సంచలన ప్రదర్శనతో మ్యాచ్ విజేతగా నిలిచాడు. టెస్ట్ కెరీర్ ప్రారంభించిన స్వల్ప కాలంలోనే తన వైవిధ్యమైన స్పిన్ బౌలింగ్‌తో అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏకంగా 10 వికెట్లు పడగొట్టి, భారత్ 165 పరుగుల భారీ విజయం సాధించడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో లంక బ్యాటర్లను కట్టడి చేయడంలో సుతార్ కీలకంగా […] -
Ind Vs SL: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ ఘన విజయం.. శ్రీలంక చిత్తు చిత్తు..
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత క్రికెట్ జట్టు 165 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. చారిత్రాత్మక గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆతిథ్య జట్టును భారత్ పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగుల భారీ స్కోరు సాధించి మ్యాచ్‌పై పట్టు సాధించింది. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తన మార్కు కౌంటర్ ఎటాకింగ్ గేమ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పగా, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ […] -
Virat Kohli-PV Sindhu: విరాట్ కోహ్లీ నా ‘బ్రదర్’.. పీవీ సింధు ఆసక్తికర వ్యాఖ్యలు..
భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో ఉన్న ప్రత్యేక అనుబంధంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. విరాట్ కోహ్లీని తాను సొంత సోదరుడిగా భావిస్తానని, కెరీర్‌లోని కష్టకాలంలో ఆయన ఇచ్చిన సలహా తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేసిందని వెల్లడించారు. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సింధు, విరాట్‌తో ఉన్న సాన్నిహిత్యం , మైదానంలో ఆయన ప్రదర్శించే పట్టుదలపై ప్రశంసల వర్షం […] -
TSLPRB: తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు, అనుబంధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 ఉద్యోగాల నియామక ప్రక్రియ నేటి ఉదయం 8 గంటల నుంచే ప్రారంభం అయింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీజీపీఆర్బీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రక్రియ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ tgprb.in లో దరఖాస్తులు సమర్పించవచ్చు. సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లకు అవకాశం ఉంది. ఈ నియామకాల్లో పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్), […] -
Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
జార్ఖండ్ ప్రభుత్వం 2014 నుంచి నిర్వహించిన ఏకంగా 44 ప్రభుత్వ నియామక పరీక్షలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (JSSC), టీడీపీఎల్ అనే ఏజెన్సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. ముఖ్యంగా జేఎస్ఎస్సీ-సీజీఎల్ (JSSC-CGL) పరీక్ష రద్దు నిర్ణయంపై తీవ్ర కలకలం రేగింది. ఈ రద్దు నిర్ణయంతో అప్పటికే […]
తాజావార్తలు
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!