Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లా రామాపురం గ్రామంలో నిర్వహించిన ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని మాట్లాడారు. సీఎం చంద్రబాబు సహకారంతో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామాలను స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో (2019-24) కేవలం 850 కిలోమీటర్ల సీసీ రోడ్లు మాత్రమే నిర్మిస్తే, కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు ఏకంగా 9 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేశామని, ఇందులో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోనే సుమారు 6 వేల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయని వెల్లడించారు.
గతంలో గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ కొనే దిక్కులేని దుస్థితి ఉండేదని, నేడు పంచాయతీలే స్వయంగా తమకు అవసరమైన పనులు, ప్రణాళికలు రూపొందించుకునే స్థాయికి ఎదిగాయని అన్నారు. గత ప్రభుత్వంలో కేవలం 304 మినీ గోకులాలు నిర్మిస్తే, నేడు 30 వేలకు పైగా మినీ గోకులాలు నిర్మించామని, పల్లె పండుగ ద్వారా 13,326 పంచాయతీల్లో అభివృద్ధి పనులు జరిగాయని, ప్రస్తుతం 10 వేల కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం పురోగతిలో ఉందని పేర్కొన్నారు.
Also Read
ఉదయగిరి ప్రాంతంలో వలసలను తగ్గించేందుకే ఇక్కడ పల్లె పండుగ 3.0ను ప్రారంభించామని, ఉదయగిరి కోటకు చేరుకునే రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి కోటను ప్రముఖ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. రాబోయే రెండేళ్లలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.1,30,000 కోట్ల భారీ వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే ప్రజలు నిర్మొహమాటంగా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!