CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
- నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులు
- బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం
- ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యం
- యంగ్ ఇండియా పాఠశాలలతో నాణ్యమైన విద్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవభారత నిర్మాత, భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 14న జరుపుకునే జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని బాలబాలికలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
బాలల పట్ల నెహ్రూకు ఉన్న అపారమైన ప్రేమ, వారి భవిష్యత్తుపై ఆయనకున్న దూరదృష్టి, విద్యాభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. బాలలే దేశ సంపద, వారే భావి భారత పౌరులనే నెహ్రూ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
Also Read
- Cricketer Nandini : వికారాబాద్‌లో విషాదం.. బీసీసీఐ అండర్-19 క్రికెటర్ నందిని ఆత్మహత్య
- New Scheme: ఆటో కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. 'ఆటో నగర్ కాలనీ' పేరుతో కొత్త స్కీమ్..
- Nerella Sharada : మహిళల జీవితాలతో ఆటలు.. ఫెర్టిలిటీ కేంద్రాలకు హెచ్చరిక
- CM Revanth Reddy : రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీకి ఎందుకంత భయం.?
ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, సమాన అవకాశాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. పిల్లల్లోని అంతర్లీన ప్రతిభను గుర్తించి, వారి సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ, ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు.
విద్య ద్వారానే సమాజంలో సమానత్వం, సమగ్ర అభివృద్ధి సాధ్యమని విశ్వసిస్తున్న ప్రజా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పోషకాహారం, విద్యా ప్రమాణాల మెరుగుదలకు అల్పాహార పథకం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, భద్రతతో కూడిన ఆహ్లాదకరమైన బాల్యాన్ని అందించినప్పుడే బలమైన, అభివృద్ధి చెందిన తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పిల్లల కలలను సాకారం చేయడం, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత కూడా అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
-
Pooja Hegde: ఫ్లాపులు వెంటాడుతున్నా తగ్గని బుట్టబొమ్మ క్రేజ్.. బన్నీ సినిమాతో జాక్‌పాట్ తగిలినట్టేనా?
-
CS Karnan Dies: సీజేఐ సహా సుప్రీంకోర్టు జడ్జీల అరెస్టుకే ఆదేశాలు.. వివాదాస్పద మాజీ హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ కన్నుమూత!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!