OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
- టీడీపీలో బాపట్ల స్థానిక ఎన్నికల ఫలితాల సెగలు
- వైసీపీ ఖాతాలో పడ్డ బాపట్ల జడ్పీటీసీ స్థానం
- మండల పరిషత్‌లో కూడా అధికార పార్టీకి ఎదురుగాలి
- బాపట్ల ఎంపీపీ వైసీపీ లిస్ట్‌లో పడటం లాంఛనమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: ఫస్ట్‌టైం ఎమ్మెల్యేగా గెలిచి చట్ట సభలో అడుగుపెట్టిన ఆ నేత మెల్లిగా రెడ్ జోన్లోకి వెళ్తున్నారా? అధికార పార్టీ శాసనసభ్యుడు అయి ఉండికూడా… తన పరిధిలోని కీలక స్థానాలను ప్రతిపక్షానికి సమర్పించుకుని ఇరకాటంలో పడ్డారా? మిత్రపక్షం జనసేన కూడా డైరెక్ట్‌గా చంద్రబాబుకే ఫిర్యాదు చేసిన ఆ ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడాయన ముందున్న అసలు సిసలైన అగ్ని పరీక్ష ఏంటి? తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి 2024 కూటమి వేవ్‌లో చట్టసభ మెట్లెక్కిన కొద్ది మందిలో ఒకరు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ. అధికార పార్టీ ఎమ్మెల్యేగా… మొదట్లో అంతా బాగానే ఉన్నా… క్రమంగా బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే మధ్య గ్యాప్ మొదలైంది. దీంతో లోకల్ టీడీపీ… ఎమ్మెల్యే, ఎంపీ వర్గాలుగా విడిపోయింది. నియోజకవర్గంలో బుసక వ్యవహారం ఇద్దరి అనుచరుల మధ్య కాక రేపింది. అలాగే… మద్యం షాపుల టెండర్ల విషయంలో కూడా రెండు వర్గాల మధ్య పెద్ద యుద్ధమే నడిచిందన్నది బాపట్ల వాయిస్. ఎమ్మెల్యే, ఎంపీ మధ్య ఆధిపత్య పోరుతో అధికారులు కూడా ఇబ్బందులు పడుతున్నారట.
అయితే నెమ్మదిగా ఎమ్మెల్యే నరేంద్రవర్మ పైచేయి సాధించి నియోజకవర్గంపై పట్టు బిగించారని అంటారు. అదంతా ఒక ఎత్తయితే… ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికలు బాపట్లను మరోసారి పొలిటికల్ స్క్రీన్ మీద హైలైట్ చేశాయి. ఈ నియోజకవర్గంలో వచ్చిన ఫలితాలు అధికారపార్టీలో సెగలు పుట్టిస్తున్నాయట. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాలున్నాయి. ఎన్నికలకు ముందే పిట్టలవానిపాలెం జెడ్పీటీసీ ఏకగ్రీవమైంది. అయితే… అది కూడా అనుకోకుండా జరిగిపోయిందని అంటారు. ఇక కర్లపాలెంను టీడీపీ కైవసం చేసుకుంది. కానీ… కీలకమైన బాపట్లలో మాత్రం ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బాపట్ల జెడ్పీటీసీగా వైసీపీ తరపున పోటీచేసిన సక్కుబాయి.. టీడీపీ అభ్యర్ది నర్మదపై 1100పైగా మెజార్టీతో విజయం సాధించడం చర్చనీయాంశమైంది. అలాగే.. బాపట్ల మండల పరిషత్ ఎన్నికల్లో కూడా టీడీపీకి ఎదురుదెబ్బ తప్పలేదు. ఈ మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అందులో వైసీపీ 8 గెలుచుకుంటే టీడీపీ ఏడుతో సరిపెట్టుకుంది.
Also Read
ఈ లెక్కన అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప బాపట్ల ఎంపీపీ పదవి వైసీపీకి దక్కడం లాంఛనమే. ఇలా.. కీలకమైన నియోజకవర్గ హెడ్క్వార్ట్లోని జెడ్పీటీసీతోపాటు ఎంపీపీ పదవి ప్రతిపక్షం ఖాతాలో పడుతున్నాయి. వైసీపీ గెలుపుకంటే ఇక్కడ టీడీపీ ఓటమి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పరిషత్ ఎన్నికల్లో ఓటమికి ఎమ్మెల్యే వైఖరే కారణమంటూ టీడీపీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయట. అభ్యర్దుల ఎంపిక సక్రమంగా లేకపోవడంవల్లే ఓడిపోయారన్న వాదన కూడా తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే నరేంద్రవర్మ పార్టీ క్యాడర్ ను పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే ఎన్నికల్లో పని చేసేందుకు వాళ్ళు కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదన్న ప్రచారం ఉంది. ఇక కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన జనసేన కూడా ఎమ్మెల్యే వేగేశన తీరుపై గుర్రుగా ఉందట. దీనికి సంబంధించి నేరుగా సీఎం చంద్రబాబుకే ఫిర్యాదులు వెళ్ళాయి.
ఇటీవల తుఫాన్ బాధిత ప్రాంతాలను పరిశీలించడానికి ముఖ్యమంత్రి నియోజకవర్గానికి వచ్చినప్పుడు జనసేన బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మీకళ నేరుగా ఆయనకే ఎమ్మెల్యే తీరుపై ఫిర్యాదు చేశారు. కూటమిగా కలుపుకునిపోవడానికి ఎమ్మెల్యే ఏ మాత్రం సిద్ధంగా లేరని, సెట్ చేయమని చెబుతున్న టైంలో వేగేశన కూడా అక్కడే ఉన్నారు. అయితే… ఎమ్మెల్యే జనసేనలో ఒకరిద్దరు నేతలకే ప్రాధాన్యత ఇస్తూ… ఆ పార్టీలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. దీనికి సంబంధించి ఏకంగా చంద్రబాబుకే జనసేన నేతలు ఫిర్యాదు చేయడం నియోజకవర్గంలో సంచలనమైంది. ఇలా… ఎన్నికల్లో ఓటమి, భాగస్వామ్యపక్షం ఫిర్యాదులు అన్నీ కలగలిసి ప్రస్తుతం నరేంద్రవర్మను రెడ్‌జోన్‌లోకి నెట్టాయని మాట్లాడుకుంటున్నారు స్థానికంగా. ఇప్పుడిక సెకండ్ ఫేజ్‌లో బాపట్ల మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతుండటంతో.. ఈసారి ఏదైనా తేడా కొడితే ఎమ్మెల్యే సూప్‌లో పడటం ఖాయమన్న అంచనాలు పెరుగుతున్నాయి.
తాజావార్తలు
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
-
Pooja Hegde: ఫ్లాపులు వెంటాడుతున్నా తగ్గని బుట్టబొమ్మ క్రేజ్.. బన్నీ సినిమాతో జాక్‌పాట్ తగిలినట్టేనా?
-
CS Karnan Dies: సీజేఐ సహా సుప్రీంకోర్టు జడ్జీల అరెస్టుకే ఆదేశాలు.. వివాదాస్పద మాజీ హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ కన్నుమూత!
-
Achanta: సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేస్తే రూ. 2 కోట్లు ఇస్తా.. జనసేన నేత సంచలన ప్రతిపాదన..
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?