OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
- నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
- ఇన్ఛార్జ్ శివానంద రెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య ఒక వర్గం,ఎంపీ శబరి ఇంకో వర్గం
- ఒక వర్గం లోపాయికారిగా వైసీపీకి సహకరించిందన్న టాక్
- చివరి నిమిషం దాకా క్లారిటీ లేక అభ్యర్థుల వెనుకబాటు
- మొత్తం 32 వార్డులు, ఛైర్మన్‌తో పాటు 23 వార్డులు వైసీపీ ఖాతాలో
- ఇప్పుడు వైస్ ఛైర్మన్ కోసం టీడీపీలోనే గ్రూపు చీలికలాట
- శివానందరెడ్డి వర్గం నుంచి శబరి వర్గంలో చేరే దిశగా ఇద్దకు కౌన్సిలర్స్
- వైస్ ఛైర్మన్ సీటు కోసం పావులు కదుపుతున్న ఎంపీ శబరి వర్గం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ విబేధాలు, వివాదాలకు కేరాఫ్‌గా మారిపోతోంది. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ పరపతి కంటే గ్రూపు తగాదాలకే ఇక్కడి నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారట. ఈ వివాదాల్లో క్యాడర్ నలిగిపోతోందంటున్నారు. వైసీపీ హయాంలో నందికొట్కూరు మున్సిపాలిటీ ఆపార్టీ జెండా రెపరెపలాడితే, ఒకే ఒక్క కౌన్సిలర్‌తో టీడీపీ సరిపెట్టుకుంది. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీలో ఒకే ఒక కౌన్సిలర్ మిగిలిపోగా.. చైర్మన్ సహా మిగిలిన కౌన్సిలర్స్ అందరికీ పసుపు కండువాలు కప్పి మున్సిపాలిటీ మాదేనని అనిపించుకుంది సైకిల్ పార్టీ. అయితే మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ జెండా రెపరెపలాడించేందుకు పనిచేయాల్సిన నేతలు ఆ పని మానేసి నువ్వా.. నేనా అంటూ పోట్లాడుకుని ఘోరపరాజయానికి కారణమయ్యారన్నది కార్యకర్తల మాట. నందికొట్కూరు నియోజకవర్గంలో పార్టీ ఇంచార్జి శివానంద రెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య ఒక వర్గం కాగా, ఎంపీ బైరెడ్డి శబరి మరో గ్రూపుగా రాజకీయాలు నడుపుతున్నారట. సమన్వయంతో పనిచేయాల్సిన నేతలు ఆ ఒక్కటీ చేయకపోవడంతో భంగపాటు తప్పలేదని అంటున్నారు. ఆర్థిక పరమైన ప్రణాళిక లేకపోవడం ఒత ఎత్తయితే… పార్టీలోని ఒక వర్గం లోపాయికారికంగా వైసీపీకి మద్దతు ఇచ్చిందని కూడా చెప్పుకుంటున్నారు. కౌన్సిలర్ అభ్యర్థి ఎవరో నామినేషన్ల ఉపసంహరణ వరకు క్లారిటీ లేదట. బీ ఫామ్ ఇస్తారో లేదో తెలియక చాలా మంది కౌన్సిలర్ అభ్యర్థులు చివరి వరకు ప్రచారం కూడా చేసుకోలేదంటున్నారు. పార్టీ సీనియర్ నేతలు కూడా మనస్ఫూర్తిగా సహకరించలేదట. చైర్మన్ అభ్యర్థి ఎంపికలోనూ విబేధాలు ఉన్నాయంటున్నారు.
చైర్మన్ స్థానానికి టీడీపీలోని ఓ వర్గం ఇండిపెండెంట్‌ను బరిలో నిలిపి మద్దతు ఇవ్వడం, ఆ అభ్యర్థికి 1300 ఓట్లు రావడం కూడా టీడీపీని దెబ్బతీసిందంటున్నారు. నందికొట్కూరు మున్సిపాలిటీలో చైర్మన్ , 32 వార్డులకు ఎన్నికలు జరిగితే చైర్మన్‌తో పాటు 23 వార్డులు వైసీపీ ఖాతాలో పడ్డాయి. 9 వార్డుల్లో మాత్రమే టీడీపీ గెలుపొందింది. అదీకూడా… స్వల్ప మెజార్టీలతోనే. ఇక 12, 28, 29వార్డులు మొదట వైసీపీ గెలిచినట్లు ప్రకటించినప్పటికీ తిరిగి ఓట్లు లెక్కించి టీడీపీ గెలిచినట్లు ప్రకటించారట. ఈ పరిణామాలతో నందికొట్కూరు టీడీపీ అప్రతిష్ఠపాలైందని చెప్పుకుంటున్నారు. ఆ దెబ్బకు పరిషత్ ఎన్నికల్లో కాస్త తేరుకున్నారట. 6 మండలాల్లో 6 జడ్పిటిసి, 65 ఎంపిటిసిలు ఉండగా టీడీపీ 5 జడ్పిటిసిలు, 39 ఎంపిటిసిలు గెల్చుకుంది. ఒక జడ్పిటిసి, 25 ఎంపిటిసిలు వైసీపీ పరం అయ్యాయి. 6 ఎంపీపీ పదవుల్లోనూ టీడీపీ 3, వైసీపీ 3 దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అటు టీడీపీ అధిష్టానం కూడా నందికొట్కూరు ఫలితాలపై సీరియస్‌గా ఉందట. ఇక తాజాగా నందికొట్కూరు మున్సిపాలిటీలో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 29వ వార్డు టిడిపి కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి, 30 వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి శివానంద రెడ్డి వర్గాన్ని వీడి ఎంపీ బైరెడ్డి శబరి వర్గంలో చేరేందుకు రంగం సిద్ధమైందట. వైస్ ఛైర్మన్ సీటు దక్కించుకునే వ్యూహంతో ఆ దిశగా కసరత్తు జరుగుతోందంటున్నారు. టీడీపీకి 9 మంది కౌన్సిలర్లు ఉండగా వారిలో ఆరుగురు బైరెడ్డి వర్గంలో చేరితే వైసీపీ నుంచి మరికొంతమందిని లాగి వైస్ చైర్మన్ సీటు సొంతం చేసుకునే వ్యూహంలో బైరెడ్డి వర్గం ఉందని చెప్పుకుంటున్నారు. ఆ విషయంలో ఈనెల 16 నాటికి క్లారిటీ వస్తుందంటున్నారు. అసలు నందికొట్కూరు మున్సిపాలిటీలో టీడీపీ నేతలంతా కలసి ఉంటే ఏకంగా చైర్మన్ సీటే గెలిచేవాళ్ళమని, ఉన్న అవకాశాలు పోగొట్టుకొని ఇప్పుడు వైస్ చైర్మన్ సీటు కోసం పాకులాడుతూ నానాపాట్లు పడాల్సి వస్తోందన్నది క్యాడర్ మాట.
Also Read
- OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
- OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
- OTR: పాయల్ శంకర్ రైతు యాత్రకు అధిష్టానం నో.. అసలు కారణం ఏంటి...?
- OTR: తాండూరులో ఇద్దరు పవర్ సెంటర్లు.. అన్నదమ్ముల ఆధిపత్య పోరుతో అధికారులకు తిప్పలు..
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!