Veerababu Burugadda
Author- NTV Telugu-
New Scheme In Telangana: తెలంగాణలో మరో కొత్త స్కీమ్ ప్రారంభం.. సీఎం చేతుల మీదుగా..
తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహార లభ్యతే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో “తొలి ముద్ద” అనే బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఇకపై ప్రతిరోజూ ఉదయం పౌష్టిక విలువలతో కూడిన అల్పాహారం అందనుంది. చిన్నారులకు రుచికరమైన, ఆరోగ్యకరమైన ఉప్మా, కిచిడీ మిక్స్ వంటి పదార్థాలను బ్రేక్ ఫాస్ట్‌గా […] -
Telangana: కీలక అలర్ట్.. ఆ జిల్లాలో మార్చి 28న బంద్.. కారణం ఇదే..
నిర్మల్ పట్టణంలో ప్రముఖ శిశువైద్యుడు డాక్టర్ సంతోష్ రాజ్ పై జరిగిన దాడి ఘటన ఇప్పుడు స్థానికంగా పెను సంచలనంగా మారింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ.. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ‘నిర్మల్ బంద్’ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు సంబంధించి ప్రధాన వివరాలు ఇలా ఉన్నాయి. ఫార్మసీ కౌన్సిల్ స్టేట్ డైరెక్టర్ , నిర్మల్ జిల్లా మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నేరెళ్ల ప్రమోద్ ఈ బంద్ కు […] -
America Currency: 165 ఏళ్ల సంప్రదాయానికి ఫుల్ స్టాప్.. ఇక అమెరికా కరెన్సీపై ట్రంప్ సంతకం..
అమెరికా కరెన్సీ నోట్లపై ఒక చారిత్రక మార్పు చోటుచేసుకోబోతోంది. అమెరికా చరిత్రలో మొదటిసారిగా.. అధికారంలో ఉన్న ఒక అధ్యక్షుడి సంతకం అక్కడి నోట్లపై ముద్రించనున్నారు. జూన్ నెల నుంచి డొనాల్డ్ ట్రంప్ సంతకంతో కూడిన డాలర్ నోట్లు చలామణిలోకి రానున్నాయని అమెరికా ట్రెజరీ విభాగం ధృవీకరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. డాలర్ నోటుపై ట్రంప్ సంతకం ఎందుకు..? అమెరికా స్వాతంత్ర్యం పొంది 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. ఈ చారిత్రక మైలురాయిని గుర్తుచేసుకుంటూ […] -
Gold Seized: తెలంగాణ ‘గోల్డ్ మ్యాన్’ బంగారం సీజ్.. అదుపులోకి తీసుకున్న ఐటీ అధికారులు..
తెలంగాణలో ‘బంగారు బాబు’గా గుర్తింపు పొందిన హోప్ ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్ ఆదాయపు పన్ను (IT) అధికారుల విచారణను ఎదుర్కోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏం జరిగిందంటే.. న్యూఢిల్లీలో జరుగుతున్న హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవానికి హాజరయ్యేందుకు కొండ విజయ్ కుమార్ గురువారం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అయితే.. ఆయన ప్రయాణానికి ముందే హైదరాబాద్‌లోని ఐటీ అధికారులు ఆయన పాన్ కార్డు వివరాలను సేకరించినట్లు సమాచారం. ఆయన ఢిల్లీ […] -
FBI Chief Email Breached: అమెరికాకు బిగ్ షాక్.. FBI చీఫ్ ఈమెయిల్ హ్యాక్ చేసిన ఇరాన్..
అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ (FBI) చీఫ్ కాష్ పటేల్ వ్యక్తిగత ఈమెయిల్ హ్యాకింగ్‌కు గురైందన్న వార్త అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్‌కు చెందిన హ్యాకర్ల బృందం ఈ పని చేసినట్లు స్వయంగా ప్రకటించుకుంది. ఏం జరిగిందంటే.. ఇరాన్‌తో సంబంధం ఉన్న ‘హండాలా హ్యాక్ టీమ్’ (Handala Hack Team) అనే హ్యాకర్ల సమూహం ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వ్యక్తిగత ఇన్-బాక్స్‌ను హ్యాక్ చేసినట్లు క్లెయిమ్ చేసింది. తమ వెబ్సైట్లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ‘విజయవంతంగా […] -
RBL Bank: బిగ్ షాక్.. ఆర్బీఎల్ బ్యాంక్‌లో భారీ కుంభకోణం..
కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0’ ద్వారా భారీ ఆర్థిక కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. జిల్లాలోని కిసాన్‌నగర్ ఆర్బీఎల్ (RBL) బ్యాంక్ బ్రాంచ్ కేంద్రంగా జరిగిన ఈ భారీ స్కామ్‌లో సుమారు రూ.137 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. చైనాకు చెందిన కొందరు వ్యక్తులతో చేతులు కలిపి స్థానిక యువత ఈ మోసాలకు పాల్పడటం గమనార్హం. కుంభకోణం ఎలా జరిగింది..? ఈ ముఠా ప్రధానంగా ‘మ్యూల్ ఖాతాల’ (Mule Accounts) నెట్‌వర్క్‌ను […] -
Grameen Credit Score: సిబిల్ స్థానంలో ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్’.. బ్యాంకులకు కేంద్రం కీలక ఆదేశాలు..
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్’ అనే వినూత్న విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో వ్యక్తుల ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడానికి ‘సిబిల్’ (CIBIL) ఎలాగైతే ప్రామాణికమో.. అదే తరహాలో గ్రామీణ ప్రజలు, రైతులు , స్వయం సహాయక సంఘాల రుణ అర్హతను గుర్తించేందుకు ఈ ప్రత్యేక స్కోర్‌ను రూపొందించనున్నారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని […] -
Abbas: 11 ఏళ్ల తర్వాత అబ్బాస్ రీ ఎంట్రీ.. ఇంత కాలం ఎక్కడున్నాడు..? ఏం చేశాడంటే…
నటుడు అబ్బాస్ అంటే తొంభైల కాలంలో ఒక పెద్ద సెన్సేషన్. అప్పట్లో కుర్రాళ్లకు ఆయనో స్టైల్ ఐకాన్. ముఖ్యంగా ఆయన హెయిర్ స్టైల్, ఆకర్షణీయమైన రూపం చూసి ఫిదా అవ్వని వారు ఉండేవారు కాదు. మొదటి సినిమా ‘ప్రేమదేశం’తోనే రాత్రికి రాత్రే స్టార్డమ్ సంపాదించుకున్న అబ్బాస్.. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలతో దూసుకుపోయారు. అయితే.. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఆయన అకస్మాత్తుగా వెండితెరకు దూరమవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దాదాపు 11 ఏళ్ల […] -
Rain Alert: ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు..
వేసవి భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఉపశమనం కలిగించే వార్తను అందించింది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వాతావరణం చల్లబడనుందని అంచనా వేసింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణపై ప్రస్తుతం ఉన్న వాతావరణ ద్రోణి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మరఠ్వాడా నుంచి కర్ణాటక […] -
MP Kavya: గడ్డి మందుపై నిషేధం విధించాలి.. లోక్‌సభలో ఎంపీ కావ్య డిమాండ్..
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు)పై పూర్తి నిషేధం విధించాలని చేసిన డిమాండ్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం పార్లమెంట్ జీరో అవర్‌లో ఆమె ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈ రసాయనం వల్ల పర్యావరణం , మానవ ఆరోగ్యంపై పడుతున్న దుష్ప్రభావాలను వివరించారు. పారాక్వాట్ డైక్లోరైడ్ కేవలం కలుపు మొక్కలను నివారించే రసాయనం మాత్రమే కాదని, ఇది నేల, నీరు, గాలిని తీవ్రంగా కలుషితం చేస్తోందని ఎంపీ స్పష్టం చేశారు. వ్యవసాయ […]
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
-
Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
-
OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
-
Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
-
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!