Grameen Credit Score: సిబిల్ స్థానంలో ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్’.. బ్యాంకులకు కేంద్రం కీలక ఆదేశాలు..
- సిబిల్ స్థానంలో గ్రామీణ క్రెడిట్ స్కోర్ విధానం..
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్’ అనే వినూత్న విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో వ్యక్తుల ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడానికి ‘సిబిల్’ (CIBIL) ఎలాగైతే ప్రామాణికమో.. అదే తరహాలో గ్రామీణ ప్రజలు, రైతులు , స్వయం సహాయక సంఘాల రుణ అర్హతను గుర్తించేందుకు ఈ ప్రత్యేక స్కోర్‌ను రూపొందించనున్నారు.
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మందికి బ్యాంకింగ్ లావాదేవీల చరిత్ర (Credit History) ఉండదు. దీనివల్ల వారు రుణాలు పొందడం కష్టతరంగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి.. వారి ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం కేవలం బ్యాంక్ లావాదేవీలనే కాకుండా ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది.
Also Read
- Samsung Roasts Apple's First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
- UIDAI Aadhaar Face Authentication: ఆధార్ వెరిఫికేషన్‌లో భారీ మార్పులు.. UIDAI తీసుకొచ్చిన కొత్త టూల్ ఇదే
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
Also Read:Telangana: ఇంధన నిల్వలు తెలంగాణ సర్కార్ కీలక అప్డేట్..
వినియోగ బిల్లులు అంటే విద్యుత్ బిల్లుల చెల్లింపుల తీరు, వివిధ సంక్షేమ పథకాల ద్వారా పొందుతున్న లబ్ధి, వాటి వినియోగం, కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC), ట్రాక్టర్ రుణాలు, ప్రాధాన్యత రంగ రుణాల చెల్లింపుల చరిత్రలు వీటిలో పరిగణలోకి తీసుకుంటారు. 2025-26 ఆర్థిక బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఈ విధానం ద్వారా గ్రామీణ రుణ మంజూరు ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. అందులో.. మొదటిసారి లోన్ తీసుకునే వారికి, ఎటువంటి క్రెడిట్ హిస్టరీ లేని వారికి ఈ స్కోర్ ఆధారంగా బ్యాంకులు వేగంగా రుణాలు మంజూరు చేస్తాయి. గ్రామీణ క్రెడిట్ స్కోర్ బాగున్న వారికి తక్కువ వడ్డీకే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు నిధులు అందుతాయి.
రుణగ్రహీత ఆర్థిక స్థితిని కచ్చితంగా అంచనా వేయడం ద్వారా బ్యాంకులు మోసపూరిత రుణాలను అరికట్టవచ్చు. ట్రాన్స్ యూనియన్ సిబిల్ వంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు ఇప్పటికే ఈ డేటాను విశ్లేషించడం ప్రారంభించాయి. ఈ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వెసులుబాటు పెరగడమే కాకుండా, అట్టడుగు వర్గాలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువవుతాయి.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?