Abbas: 11 ఏళ్ల తర్వాత అబ్బాస్ రీ ఎంట్రీ.. ఇంత కాలం ఎక్కడున్నాడు..? ఏం చేశాడంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు అబ్బాస్ అంటే తొంభైల కాలంలో ఒక పెద్ద సెన్సేషన్. అప్పట్లో కుర్రాళ్లకు ఆయనో స్టైల్ ఐకాన్. ముఖ్యంగా ఆయన హెయిర్ స్టైల్, ఆకర్షణీయమైన రూపం చూసి ఫిదా అవ్వని వారు ఉండేవారు కాదు. మొదటి సినిమా ‘ప్రేమదేశం’తోనే రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సంపాదించుకున్న అబ్బాస్.. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలతో దూసుకుపోయారు. అయితే.. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఆయన అకస్మాత్తుగా వెండితెరకు దూరమవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దాదాపు 11 ఏళ్ల పాటు సినిమా ప్రపంచానికి పూర్తిగా దూరమై, తనకంటూ ఒక కొత్త జీవితాన్ని నిర్మించుకున్నారు. గ్లామర్ ప్రపంచాన్ని వదిలి సాధారణ వ్యక్తిలా విదేశాల్లో స్థిరపడటం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి.
అబ్బాస్ కేవలం 19 ఏళ్ల వయసులోనే వెండితెరపై అడుగుపెట్టారు. అప్పట్లో డబ్బు సంపాదించడమే ప్రధాన లక్ష్యంగా సినిమాల్లోకి వచ్చానని ఆయన నిజాయితీగా చెబుతుంటారు. ప్రారంభంలో అద్భుతమైన విజయాలు చూసినా.. ఆ తర్వాత వరుస పరాజయాలు ఆయన్ని ఇబ్బంది పెట్టాయి. ఒకానొక దశలో అవకాశాల కోసం నిర్మాతల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఆ సమయంలోనే తన పనిని తాను ఆస్వాదించలేకపోతున్నానని గ్రహించి, మానసిక ప్రశాంతత కోసం సినిమాలకు స్వస్తి పలికారు. కేవలం సినిమా మనిషిగానే కాకుండా.. తనకంటూ ఒక సొంత గుర్తింపు ఉండాలని భావించారు.
Also Read
- Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
- Delhi PUC Rules: వాహనదారులకు అలర్ట్.. PUC గడువు ముగిసిందా? అక్టోబర్ 1 నుంచి రూ.10 వేల వరకు చలాన్
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
Also Read:Iran-Hormuz: హార్ముజ్‌పై ఇరాన్ సంచలన నిర్ణయం.. కొత్త టెన్షన్ మొదలైనట్లేనా?
న్యూజిలాండ్ ప్రయాణం…
2015లో మలయాళ సినిమా తర్వాత ఆయన తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ వెళ్ళిపోయారు. అక్కడ ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో బిజినెస్ అనలిస్ట్‌గా ఉద్యోగంలో చేరారు. గ్లామర్ ప్రపంచానికి దూరంగా.. ఒక సాధారణ ఉద్యోగిలా ఉంటూ తన జీవితాన్ని కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ క్రమంలో తన జీవిత పాఠాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. వారిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
సెకండ్ ఇన్నింగ్స్… ‘హ్యాపీ రాజ్’తో రీఎంట్రీ…
ఇంతకాలం విదేశాల్లో ఉన్న అబ్బాస్.. మళ్ళీ తన సొంత గడ్డపైకి అడుగుపెట్టారు. శుక్రవారం (మార్చి 27) విడుదలైన ‘హ్యాపీ రాజ్’ సినిమాతో ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించారు. జీవీ ప్రకాష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అబ్బాస్ హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించి అలరించారు. అప్పట్లో లవర్ బాయ్‌గా మెప్పించిన ఆయన.. ఇప్పుడు తండ్రి పాత్రలో మెప్పించడం విశేషం. తెలుగు ప్రేక్షకులు కూడా తమ పాత హీరోను మళ్ళీ తెరపై చూడటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
OnePlus 16: వన్ ప్లస్ 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 185Hz డిస్ప్లే, 200MP కెమెరాతో అదరగొట్టనున్న ఫోన్
-
Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
-
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
-
Delhi PUC Rules: వాహనదారులకు అలర్ట్.. PUC గడువు ముగిసిందా? అక్టోబర్ 1 నుంచి రూ.10 వేల వరకు చలాన్
-
Love And War : ‘లవ్ అండ్ వార్’ను విడిచిపెట్టని లీక్స్
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!