Gold Seized: తెలంగాణ ‘గోల్డ్ మ్యాన్’ బంగారం సీజ్.. అదుపులోకి తీసుకున్న ఐటీ అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ‘బంగారు బాబు’గా గుర్తింపు పొందిన హోప్ ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్ ఆదాయపు పన్ను (IT) అధికారుల విచారణను ఎదుర్కోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏం జరిగిందంటే.. న్యూఢిల్లీలో జరుగుతున్న హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవానికి హాజరయ్యేందుకు కొండ విజయ్ కుమార్ గురువారం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అయితే.. ఆయన ప్రయాణానికి ముందే హైదరాబాద్‌లోని ఐటీ అధికారులు ఆయన పాన్ కార్డు వివరాలను సేకరించినట్లు సమాచారం. ఆయన ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన వెంటనే.. అక్కడ వేచి ఉన్న నలుగురు ఐటీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
12 గంటల సుదీర్ఘ విచారణ..
Also Read
- Tamil Nadu: కొత్త అసెంబ్లీ–సచివాలయం.. ఒకే చోట అన్ని ప్రభుత్వ శాఖలు.. సీఎం విజయ్ ప్రకటన
- Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
- Vijay-Congress: ముందు మంచి ముఖ్యమంత్రి అవ్వండి.. విజయ్‌కు కాంగ్రెస్ సూచన
- Lord Ganesha: 66 కేజీల బంగారం, 335 కేజీల వెండి.. రూ.703 కోట్ల బీమా.. మహా గణపతి దివ్య దర్శనం ఇలా..
విజయ్ కుమార్ తన ఒంటిపై భారీగా బంగారు ఆభరణాలు ధరించి ఉండటమే ఈ తనిఖీలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. సుమారు 12 గంటల పాటు ఆయనను విమానాశ్రయంలోనే ప్రత్యేకంగా విచారించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయన ధరించిన సుమారు కొన్ని కిలోల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకుని, వాటికి సంబంధించిన కొనుగోలు రశీదులు, ఆదాయ వనరులపై ప్రశ్నలు సంధించారు. ఆయన పేరిట ఉన్న స్థిర, చర ఆస్తుల వివరాలను, హోప్ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న లావాదేవీలను అధికారులు ఆరా తీశారు. సుదీర్ఘ విచారణ అనంతరం.. హాకీ ఇండియా అవార్డుల కార్యక్రమానికి వెళ్లడానికి ఆయనకు అనుమతినిచ్చారు. అయితే.. త్వరలోనే పూర్తిస్థాయి ఆధారాలతో మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.
Also Read:FBI Chief Email Breached: అమెరికాకు బిగ్ షాక్.. FBI చీఫ్ ఈమెయిల్ హ్యాక్ చేసిన ఇరాన్..
ఎవరీ కొండ విజయ్ కుమార్..?
హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లికి చెందిన విజయ్ కుమార్.. తన ఒంటిపై దాదాపు 5 నుంచి 12 కిలోల వరకు బంగారం ధరిస్తూ సోషల్ మీడియాలో ‘గోల్డ్ మ్యాన్’గా ఫేమస్ అయ్యారు. ఆయన హోప్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఐటీ శాఖ ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అధికారుల తనిఖీల్లో తేలే అంశాలను బట్టి ఈ కేసు మున్ముందు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’.. పాతబస్తీ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి
-
Tamil Nadu: కొత్త అసెంబ్లీ–సచివాలయం.. ఒకే చోట అన్ని ప్రభుత్వ శాఖలు.. సీఎం విజయ్ ప్రకటన
-
Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
-
Vijay-Congress: ముందు మంచి ముఖ్యమంత్రి అవ్వండి.. విజయ్‌కు కాంగ్రెస్ సూచన
-
Lord Ganesha: 66 కేజీల బంగారం, 335 కేజీల వెండి.. రూ.703 కోట్ల బీమా.. మహా గణపతి దివ్య దర్శనం ఇలా..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!