New Scheme In Telangana: తెలంగాణలో మరో కొత్త స్కీమ్ ప్రారంభం.. సీఎం చేతుల మీదుగా..
- ‘తొలి ముద్ద’ స్కీమ్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..
- అంగన్ వాడీ విద్యార్థులకు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహార లభ్యతే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో “తొలి ముద్ద” అనే బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఇకపై ప్రతిరోజూ ఉదయం పౌష్టిక విలువలతో కూడిన అల్పాహారం అందనుంది. చిన్నారులకు రుచికరమైన, ఆరోగ్యకరమైన ఉప్మా, కిచిడీ మిక్స్ వంటి పదార్థాలను బ్రేక్ ఫాస్ట్‌గా అందిస్తారు.
అంగన్‌వాడీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు, పారదర్శకత కోసం అంగన్‌వాడీ వర్కర్లకు ముఖ్యమంత్రి మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలు ఇకపై అద్దె భవనాల్లో ఉండకూడదని.. వాటికి సొంత భవనాలు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో దేశాభివృద్ధికి విద్య, నీటిపారుదల ఎంత ముఖ్యమో, రాబోయే తరం ఆరోగ్యంగా ఉండటం కూడా అంతే ముఖ్యమని నొక్కి చెప్పారు.
Also Read
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
- Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
Also Read:Asaduddin Owaisi: ధురంధర్ ఒక చెత్త సినిమా.. అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్..
‘దేశంలో ఆహార భద్రత ఉంది.. కానీ పోషకాహార భద్రత కరువైంది. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారం అందించడం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలం’ అని అన్నారు. ఆరేళ్ల లోపు పిల్లలకు సరైన పౌష్టికాహారం అందకపోతే.. అది భవిష్యత్తులో వారి మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని, అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
అంగన్‌వాడీ టీచర్ల పాత్ర..
ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా.. వాటిని క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాల్సింది అంగన్‌వాడీ టీచర్లే అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంగన్‌వాడీ సిబ్బందిని ప్రభుత్వం తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తుందని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే వారి సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చిన్నారులను తమ సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత టీచర్లపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. “తొలి ముద్ద” పథకం కేవలం ఆకలి తీర్చడమే కాకుండా.. తెలంగాణ భవిష్యత్ పౌరుల శారీరక, మానసిక వికాసానికి గట్టి పునాది వేయనుంది. పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడంలో ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలవనుంది.
తాజావార్తలు
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?