Veerababu Burugadda
Author- NTV Telugu-
Labour Laws: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి తగ్గనున్న జీతాలు..!
వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మన దేశంలో పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభం కావడంతో పన్నులు, ఉద్యోగుల జీతాలు, రైల్వే ప్రయాణాల నియమాల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. సామాన్యుడి జేబుపై ప్రభావం చూపించే ఆ ముఖ్యమైన మార్పులేంటో ఇక్కడ తెలుసుకుందాం. 1. కొత్త ఆదాయపు పన్ను చట్టం (2025).. దశాబ్దాల కాలం నాటి పాత పన్ను చట్టం స్థానంలో కొత్త ‘ఆదాయపు పన్ను చట్టం 2025’ అమలులోకి రానుంది. […] -
Flight Journey: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 20 నుంచి ప్రతీ విమానంలో 60 శాతం ఉచిత సీట్లు..
ప్రస్తుతం విమాన ప్రయాణం చేసే సామాన్యులకు సీటు ఎంపిక (Seat Selection) అనేది ఒక పెద్ద ఆర్థిక భారంగా మారింది. టికెట్ ధర కంటే సీటు కోసం అదనంగా చెల్లించాల్సి రావడంపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో, విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) , కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. ఏప్రిల్ 20, 2026 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం, విమాన ప్రయాణం […] -
MI Vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్.. తుది జట్లు ఇవే..
ఐపీఎల్ 2026 సీజన్ రెండవ మ్యాచ్‌లో భాగంగా ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్లు తలపడుతున్నాయి. ఈ హై-వోల్టేజ్ పోరులో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ గెలిచిన అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. “మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాము. వాంఖడే పిచ్ ఎప్పుడూ లేనంత పచ్చగా కనిపిస్తోంది. ఇది మా కోట.. ఇక్కడి ప్రేక్షకుల మద్దతు మాకు కొండంత […] -
iPhone: ఐఫోన్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ఐఫోన్ ధరలు..
ప్రీమియం స్మార్ట్ఫోన్ల మార్కెట్లో రారాజుగా వెలుగుతున్న యాపిల్ ఐఫోన్ (iPhone) ప్రియులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో వినియోగదారులను ఊరించిన పాత తరం ఐఫోన్ మోడళ్ల ధరలు ఇప్పుడు భారతీయ మార్కెట్లో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా యాపిల్ సంస్థ తన ఆఫ్‌లైన్ రిటైల్ పార్ట్నర్ల కోసం ప్రత్యేకమైన ప్రోత్సాహక కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. దీని వల్ల రిటైలర్లు కస్టమర్లకు భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ప్రమోషనల్ డిస్కౌంట్లు ఇవ్వడానికి […] -
Bank Account: మహిళా రైతు ఖాతాలో రూ.10 కోట్లు జమ.. ఆమె చేసిన పనికి అందరూ ఫిదా..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మైన్‌పురి జిల్లాలో ఒక సాధారణ రైతు కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. ఏటీఎంకు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసుకున్న ఆ కుటుంబానికి, తమ ఖాతాలో ఏకంగా రూ. 10 కోట్లు ఉండటంతో ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మాయి. బ్యాంకు సర్వర్లలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏటీఎం స్క్రీన్‌పై కోట్లాది రూపాయలు.. మైన్‌పురి జిల్లాలోని సుల్తాన్ గంజ్ ప్రాంతానికి చెందిన సీత అనే […] -
Condoms Shortage: యుద్ధ ప్రభావం.. భారీగా ఏర్పడిన కండోమ్‌ల కొరత..
మధ్యప్రాచ్యంలో రగులుతున్న ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధ జ్వాలలు కేవలం ఆయుధాలకు, సరిహద్దులకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాన్యుల పడకగది వరకు చేరుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యుద్ధం వల్ల సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో, రానున్న రోజుల్లో కండోమ్‌ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముడిసరుకుల కొరత.. కండోమ్‌ల తయారీలో అత్యంత కీలకమైన పదార్థాలు సిలికాన్ ఆయిల్ , అమ్మోనియా. కండోమ్‌లు మృదువుగా […] -
Fake Gold: మెరిసేదంతా బంగారం కాదు.. ‘గోల్డ్ మ్యాన్’ కాస్త రోల్డ్ గోల్డ్ అయ్యాడుగా..
హైదరాబాద్ నగరంలో భారీ బంగారు ఆభరణాలతో సోషల్ మీడియాను ఊపేసిన ‘గోల్డ్ మ్యాన్’ సూర్య భాయ్ అసలు రంగు బయటపడింది. అత్తాపూర్ ప్రాంతానికి చెందిన పల్లపు సురేష్ కుమార్ అలియాస్ ‘సూర్య భాయ్’ చుట్టూ అల్లుకున్న మెరిసే ఇమేజ్ అంతా కేవలం ‘నకిలీ’ అని ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు తేల్చారు. విచారణలో బయటపడిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నకిలీ వెలుగులు.. అసలు నిజాలు.. తెలంగాణ హాకీ సంఘం అధ్యక్షుడు కొండ […] -
RBI Plan: రూపాయి విలువ పెంచేందుకు ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. ఇక దూసుకుపోవడమే..
భారత కరెన్సీ ‘రూపాయి’ విలువ అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా పడిపోతుండటంతో భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) రంగంలోకి దిగింది. రూపాయి విలువను కాపాడేందుకు, మార్కెట్లో గందరగోళాన్ని తగ్గించేందుకు తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఆర్బీఐ ఇలాంటి కఠిన నిర్ణయాలు అరుదుగా తీసుకుంటుంది.. కానీ ప్రస్తుతం రూపాయి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఈ అడుగు వేసింది. ఏమిటీ కొత్త నిబంధన..? ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. దేశంలోని అన్ని బ్యాంకులు తమ వద్ద ఉండే […] -
Chicken Price: చికెన్ షాపుల ముందు క్యూ కట్టిన జనాలు.. కారణం ఇదే..
తెలుగు రాష్ట్రాల్లోని మాంసాహార ప్రియులకు, ముఖ్యంగా చికెన్ లవర్స్‌కు ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త. గత కొన్ని వారాలుగా ఆకాశాన్ని తాకిన చికెన్ ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. సామాన్యుడికి అందుబాటులో లేనంతగా పెరిగిన ధరలు, ఇప్పుడు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటుండటంతో మార్కెట్లు చికెన్ ప్రియులతో కళకళలాడుతున్నాయి. ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు.. మార్చి నెల ప్రారంభంలో ఎండల తీవ్రత పెరగడం కోళ్ల పెంపకంపై తీవ్ర ప్రభావం చూపింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో కోళ్ల ఫారాల్లో మరణాల […] -
Rain Alert: రెయిన్ అలర్ట్.. రేపటి నుంచి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రేపటి నుంచి అంటే మార్చి 30, 31 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రమైన ఉరుములు.. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఉత్తర, పశ్చిమ, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి […]
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
-
Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
-
OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
-
Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
-
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!