America Currency: 165 ఏళ్ల సంప్రదాయానికి ఫుల్ స్టాప్.. ఇక అమెరికా కరెన్సీపై ట్రంప్ సంతకం..
- 165 ఏళ్ల సంప్రదాయానికి ముగింపు..
- అమెరికా కరెన్సీపై ట్రెజరర్ సంతకం చేసే పద్ధతికి స్వస్తి..
- డాలర్‌పై అమెరికా అధ్యక్షుడి ట్రంప్ సంతకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా కరెన్సీ నోట్లపై ఒక చారిత్రక మార్పు చోటుచేసుకోబోతోంది. అమెరికా చరిత్రలో మొదటిసారిగా.. అధికారంలో ఉన్న ఒక అధ్యక్షుడి సంతకం అక్కడి నోట్లపై ముద్రించనున్నారు. జూన్ నెల నుంచి డొనాల్డ్ ట్రంప్ సంతకంతో కూడిన డాలర్ నోట్లు చలామణిలోకి రానున్నాయని అమెరికా ట్రెజరీ విభాగం ధృవీకరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
డాలర్ నోటుపై ట్రంప్ సంతకం ఎందుకు..?
Also Read
- Macron vs Trump: ‘అవి తెలివి తక్కువ వ్యాఖ్యలు’.. ఫ్రాన్స్ అల్లర్లపై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన మాక్రాన్
- AP Municipal Elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్.. SEC కీలక ఉత్తర్వులు..
- Fake Press IDs: అంగట్లో జర్నలిస్టు ఐడీలు.. రూ.599 చెల్లిస్తే చాలు..
- NZ Vs IND: కివీస్‌తో తొలి టీ20.. బరిలోకి స్టార్ ప్లేయర్.. పిచ్ రిపోర్ట్, తుది జట్ల వివరాలు ఇవే..
అమెరికా స్వాతంత్ర్యం పొంది 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. ఈ చారిత్రక మైలురాయిని గుర్తుచేసుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశ ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధికి గుర్తుగా అధ్యక్షుడి సంతకాన్ని నోట్లపై చేర్చడం ఒక గౌరవంగా భావిస్తున్నట్లు ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ తెలిపారు. గత 161 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని మారుస్తూ.. ఇకపై ట్రెజరర్ సంతకం స్థానంలో అధ్యక్షుడి సంతకం కనిపిస్తుంది.
ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి..?
జూన్ నెల నుంచి 100 డాలర్ల నోట్లపై ట్రంప్ , బెస్సెంట్ సంతకాలతో ముద్రణ ప్రారంభం కానుంది. తొలుత 100 డాలర్ల నోట్లు.. ఆ తర్వాత మిగిలిన అన్ని రకాల నోట్లపై ఈ మార్పులు చేస్తారు. ముద్రణ పూర్తయ్యాక.. ఫెడరల్ రిజర్వ్ వ్యవస్థ ద్వారా ఇవి సాధారణ ప్రజలకు, బ్యాంకులకు చేరుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుంది.
చట్టపరంగా ఇది సాధ్యమేనా..?
అమెరికా చట్టం ప్రకారం.. బతికున్న వ్యక్తుల చిత్రాలను నాణేలు లేదా నోట్లపై ముద్రించడం నిషిద్ధం. అందుకే గతంలో ట్రంప్ ముఖచిత్రంతో కూడిన నాణెం విడుదలకు ఆటంకం కలిగింది. అయితే, సంతకాల విషయంలో ట్రెజరీ విభాగానికి పూర్తి అధికారం ఉంటుంది. నోట్లపై ఉండే ‘ఇన్ గాడ్ వి ట్రస్ట్’ వంటి నినాదాలు లేదా పాత వ్యక్తుల చిత్రాలలో ఎటువంటి మార్పు ఉండదు.. కేవలం సంతకం చేసే అధికారి పేరు మాత్రమే మారుతుంది.
మిశ్రమ స్పందన..
1861 నుంచి నిరంతరాయంగా వస్తున్న ట్రెజరర్ సంతకం చేసే పద్ధతికి ఇప్పుడు స్వస్తి పలికారు. దీనిపై కొందరు మాజీ అధికారులు స్పందిస్తూ.. ఇది అమెరికా ఆర్థిక శక్తికి నిదర్శనమని ప్రశంసించగా.. మరికొందరు ఈ సుదీర్ఘ సంప్రదాయాన్ని పక్కన పెట్టడంపై మౌనంగా ఉన్నారు. ఏది ఏమైనా.. జూన్ నుంచి అమెరికా డాలర్ ఒక సరికొత్త రూపంలో ప్రపంచం ముందుకు రాబోతోంది.
తాజావార్తలు
-
Macron vs Trump: ‘అవి తెలివి తక్కువ వ్యాఖ్యలు’.. ఫ్రాన్స్ అల్లర్లపై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన మాక్రాన్
-
AP Municipal Elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్.. SEC కీలక ఉత్తర్వులు..
-
Fake Press IDs: అంగట్లో జర్నలిస్టు ఐడీలు.. రూ.599 చెల్లిస్తే చాలు..
-
NZ Vs IND: కివీస్‌తో తొలి టీ20.. బరిలోకి స్టార్ ప్లేయర్.. పిచ్ రిపోర్ట్, తుది జట్ల వివరాలు ఇవే..
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!