Rain Alert: రెయిన్ అలర్ట్.. రేపటి నుంచి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
- మార్చి 30, 31 తేదీల్లో భారీ వర్ష సూచన..
- హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ శాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రేపటి నుంచి అంటే మార్చి 30, 31 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
తీవ్రమైన ఉరుములు..
Also Read
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
వాతావరణ మార్పుల నేపథ్యంలో ఉత్తర, పశ్చిమ, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈ జిల్లాల్లో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీచడమే కాకుండా.. అక్కడక్కడా వడగండ్ల వాన కురిసే ప్రమాదం కూడా ఉంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని అధికారులు సూచించారు.
హైదరాబాద్‌కు ఊరట..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే.. మార్చి 30, 31 తేదీల్లో నగరవాసులకు ఎండ వేడి నుంచి ఉపశమనం లభించనుంది. మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఒకసారి తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. దీనివల్ల గత కొన్ని రోజులుగా నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణం కాస్త చల్లబడుతుంది.
వడగండ్ల వాన, బలమైన గాలుల వల్ల పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కోత దశలో ఉన్న పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. గాలులు వీస్తున్న సమయంలో విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి. మెరుపులు వస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలన్నారు. వర్షం పడే సమయంలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొత్తానికి ఈ రెండు రోజుల వర్షాలు అటు ఎండల తీవ్రతను తగ్గించడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా వాతావరణాన్ని మార్చివేయనున్నాయి.
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!