Bank Account: మహిళా రైతు ఖాతాలో రూ.10 కోట్లు జమ.. ఆమె చేసిన పనికి అందరూ ఫిదా..
- టెక్నికల్ ఎర్రర్‌తో మహిళ అకౌంట్లో రూ.10 కోట్లు జమ..
- బ్యాంక్ అధికారులకు ఫోన్ చేసి చెప్పిన సదరు మహిళ..
- ఆమె చేసిన పనికి నెటిజన్లు ఫిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మైన్‌పురి జిల్లాలో ఒక సాధారణ రైతు కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. ఏటీఎంకు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసుకున్న ఆ కుటుంబానికి, తమ ఖాతాలో ఏకంగా రూ. 10 కోట్లు ఉండటంతో ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మాయి. బ్యాంకు సర్వర్‌లలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఏటీఎం స్క్రీన్‌పై కోట్లాది రూపాయలు..
Also Read
- Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
- IND Vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
- New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
మైన్‌పురి జిల్లాలోని సుల్తాన్ గంజ్ ప్రాంతానికి చెందిన సీత అనే మహిళకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంది. ఆమె కుమారుడు అరుణ్ కుమార్ కొత్త ఏటీఎం పిన్ జనరేట్ చేయడానికి, బ్యాలెన్స్ చెక్ చేయడానికి బ్యాంకు ఏటీఎంకు వెళ్ళాడు. స్క్రీన్‌పై బ్యాలెన్స్ చూడగానే అతను అవాక్కయ్యాడు. అందులో అక్షరాలా రూ. 9,99,49,586 (దాదాపు 10 కోట్లు) ఉన్నట్లు చూపించింది. కళ్లని నమ్మలేక రెండు మూడు సార్లు రశీదులు తీసి చూసినా అదే మొత్తం కనిపించడంతో కంగారుగా ఇంటికి పరిగెత్తాడు.
నిజాయతీ చాటుకున్న రైతు కుటుంబం..
సాధారణంగా ఎవరైనా తమ ఖాతాలో అంత డబ్బు చూస్తే సంబరపడతారు. కానీ, వ్యవసాయంపై ఆధారపడి బతికే ఆ కుటుంబం మాత్రం భయపడింది. ‘ఆ డబ్బు ఎవరిదో మాకు తెలియదు. మా కష్టార్జితం కాని రూపాయి కూడా మాకు వద్దు. బ్యాంకు అధికారులు ఆ డబ్బును వెంటనే వెనక్కి తీసుకోవాలి’ అని సీత, ఆమె భర్త ఫర్జన్ స్పష్టం చేశారు. బ్యాంకు సెలవు ముగియగానే వెళ్లి ఆ మొత్తాన్ని అప్పగిస్తామని వారు ప్రకటించి తమ నిజాయతీని చాటుకున్నారు.
Also Read:Condoms Shortage: యుద్ధ ప్రభావం.. భారీగా ఏర్పడిన కండోమ్‌ల కొరత..
వైరల్ వీడియో.. బ్యాంకు వివరణ..
ఏటీఎం బ్యాలెన్స్ స్లిప్పులు, ఫొటోలు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీనిపై బ్యాంక్ ఆఫ్ ఇండియా సుల్తాన్‌గంజ్ బ్రాంచ్ అధికారులు స్పందిస్తూ.. ఇది కేవలం ‘టెక్నికల్ ఎర్రర్’ మాత్రమేనని తెలిపారు. సదరు మహిళకు బ్యాంకులో లోన్ అకౌంట్ ఉందని, సిస్టమ్ అప్‌డేట్ సమయంలో ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయని వివరణ ఇచ్చారు. అయితే, ఇంత భారీ మొత్తంలో నగదు ఒక సామాన్యురాలి ఖాతాలోకి రావడం బ్యాంకింగ్ వ్యవస్థలోని భద్రతా లోపాలను వేలెత్తి చూపుతోంది.
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!