RBI Plan: రూపాయి విలువ పెంచేందుకు ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. ఇక దూసుకుపోవడమే..
- రూపాయి విలువ పెంచేందుకు రంగంలోకి ఆర్బీఐ..
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ..
- త్వరలోనే రూపాయి విలువ పెరిగే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత కరెన్సీ ‘రూపాయి’ విలువ అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా పడిపోతుండటంతో భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) రంగంలోకి దిగింది. రూపాయి విలువను కాపాడేందుకు, మార్కెట్లో గందరగోళాన్ని తగ్గించేందుకు తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఆర్‌బీఐ ఇలాంటి కఠిన నిర్ణయాలు అరుదుగా తీసుకుంటుంది.. కానీ ప్రస్తుతం రూపాయి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఈ అడుగు వేసింది.
ఏమిటీ కొత్త నిబంధన..?
Also Read
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. దేశంలోని అన్ని బ్యాంకులు తమ వద్ద ఉండే విదేశీ కరెన్సీ నిల్వలపై (Net Open Position – NOP) పరిమితిని పాటించాలి. ప్రతి రోజూ వ్యాపార సమయం ముగిసే సమయానికి.. భారత రూపాయికి వ్యతిరేకంగా బ్యాంకులు ఉంచుకునే నెట్ ఓపెన్ పొజిషన్ 100 మిలియన్ డాలర్లకు మించకూడదు. ఈ నిబంధనను ఏప్రిల్ 10వ తేదీలోగా అన్ని బ్యాంకులు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు దీని పరిధి 1 బిలియన్ డాలర్లుగా ఉండటం విశేషం.
రూపాయి ఎందుకు పడిపోతోంది..?
గత కొద్ది రోజులుగా రూపాయి విలువ వరుసగా రికార్డు స్థాయి కనిష్టాలకు పడిపోతోంది. దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది పశ్చిమ ఆసియా యుద్ధం. ఫిబ్రవరి చివరలో మొదలైన యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ (ముడి చమురు) ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావం నేరుగా రూపాయిపై పడింది. రెండో కారణం.. పెట్టుబడుల ఉపసంహరణ. విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి తమ డబ్బును వేగంగా వెనక్కి తీసుకుంటున్నారు. దీనివల్ల డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి బలహీనపడింది.
చారిత్రాత్మక పతనం అనేది మూడో కారణంగా చెప్పుకోవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూపాయి విలువ దాదాపు 10 శాతం కంటే ఎక్కువ పడిపోయింది. 2011-12 తర్వాత రూపాయికి ఇది అత్యంత దారుణమైన ఏడాదిగా నిలిచింది. శుక్రవారం నాటికి డాలర్ విలువ రూ. 94.84 వద్ద ఆల్‌టైమ్ రికార్డు కనిష్టానికి చేరింది. త్వరలోనే ఇది రూ. 95 మార్కును దాటే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నిర్ణయం వల్ల లాభమేంటి..?
బ్యాంకులు సాధారణంగా తమ లాభాల కోసం డాలర్లను కొని ఉంచుకుంటాయి. ఇలా బ్యాంకులు పెద్ద ఎత్తున డాలర్లను హోల్డ్ చేయడం వల్ల మార్కెట్లో రూపాయి విలువ ఒక్కసారిగా పడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆర్‌బీఐ పెట్టిన 100 మిలియన్ డాలర్ల పరిమితి వల్ల.. బ్యాంకులు ఇష్టానుసారంగా డాలర్లను నిల్వ ఉంచలేవు. దీనివల్ల మార్కెట్లో డాలర్ల లభ్యత పెరిగి.. రూపాయి విలువ మరీ వేగంగా పడిపోకుండా అడ్డుకట్ట వేయవచ్చు.
రూపాయి విలువలో వచ్చే అనవసరపు హెచ్చుతగ్గులను నియంత్రించడానికి ఇది ఒక బ్రేక్ లాగా పనిచేస్తుంది. గతంలో బ్యాంకులు తమ మూలధనంలో 25 శాతం వరకు ఇలాంటి పొజిషన్లు ఉంచుకునే వీలుండేది.. కానీ ఇప్పుడు ఆర్‌బీఐ నేరుగా ఒక పరిమితిని విధించడం ద్వారా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి కేంద్ర బ్యాంకు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!