MI Vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్.. తుది జట్లు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్ రెండవ మ్యాచ్‌లో భాగంగా ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్లు తలపడుతున్నాయి. ఈ హై-వోల్టేజ్ పోరులో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
టాస్ గెలిచిన అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. “మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాము. వాంఖడే పిచ్ ఎప్పుడూ లేనంత పచ్చగా కనిపిస్తోంది. ఇది మా కోట.. ఇక్కడి ప్రేక్షకుల మద్దతు మాకు కొండంత బలం. జట్టులో రోహిత్, సూర్య, శాంట్నర్ వంటి అనుభవజ్ఞులైన కెప్టెన్లు ఉన్నారు, యువత, అనుభవం కలగలిసిన మా జట్టు సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది. మేము 6 గురు బ్యాటర్లు, 5 గురు బౌలర్లతో బరిలోకి దిగుతున్నాం’ అని ధీమా వ్యక్తం చేశాడు.
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
కేకేఆర్ వ్యూహం.. అజింక్యా రహానే మాటల్లో..
మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే మాట్లాడుతూ.. ‘మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. వాంఖడేలో ఇంత పచ్చికను ఎప్పుడూ చూడలేదు. ముంబై ఛాంపియన్ టీమ్ అని తెలుసు, వారితో తలపడటానికి ఆసక్తిగా ఉన్నాం. గత రికార్డుల గురించి ఆలోచించకుండా ప్రస్తుత మ్యాచ్‌పైనే దృష్టి పెడుతున్నాం. జట్టులో కొన్ని గాయాల సమస్యలు ఉన్నాయి, అందుకే 6 గురు బ్యాటర్లు, 5 గురు బౌలర్లతో వెళ్తున్నాం’ అని తెలిపాడు.
ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ ఆటగాళ్లతో చాలా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్‌లో చెలరేగే ఫామ్‌లో ఉండటం వారికి కలిసొచ్చే అంశం. ఇక కేకేఆర్ జట్టులో ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్ వంటి విదేశీ ఆటగాళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే హర్షిత్ రాణా గాయం, పతిరన దూరం కావడం కేకేఆర్ బౌలింగ్ విభాగాన్ని కాస్త బలహీనపరిచింది.
తుది జట్లు (Playing XI):
ముంబై ఇండియన్స్:
రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, ఏఎం గజన్ ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
కోల్‌కతా నైట్‌రైడర్స్:
ఫిన్ అలెన్, అజింక్యా రహానే (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజరబానీ.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?