Veerababu Burugadda
Author- NTV Telugu-
Samsung Smartphones: మళ్లీ ధరలు పెంచిన శాంసంగ్.. ఏ ఫోన్ ఎంత ధర పెరిగిందంటే..
భారత మార్కెట్లో శాంసంగ్ తన పాపులర్ గెలాక్సీ A మరియు F సిరీస్ స్మార్ట్ఫోన్ల ధరలను పెంచుతున్నట్లు సమాచారం. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ లీక్ చేసిన సమాచారం ప్రకారం.. ఈ పెరిగిన ధరలు ఏప్రిల్ 10, 2026 నుంచి అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ , మిడ్-రేంజ్ విభాగాల్లోని గెలాక్సీ A06, A07, A17, A36, A56 , F17 మోడల్స్‌పై ఈ ప్రభావం ఉండనుంది. మోడల్ వారీగా పెరగనున్న ధరల వివరాలు.. గెలాక్సీ A06 […] -
Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?
ప్రపంచవ్యాప్తంగా బుల్లెట్ బండ్లకు పేరుగాంచిన రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగుపెట్టింది. పాతకాలపు క్లాసిక్ లుక్, ఆధునిక టెక్నాలజీ కలయికతో తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ‘ఫ్లయింగ్ ఫ్లీ C6’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. సాధారణంగా రాయల్ ఎన్ఫీల్డ్ అంటే బరువైన ఇంజన్ శబ్దం గుర్తుకువస్తుంది, కానీ ఈ కొత్త బైక్ నిశ్శబ్దంగా.. పర్యావరణానికి మేలు చేస్తూ దూసుకుపోతుంది. తక్కువ బరువు, అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన ఈ బైక్ యువతను, ముఖ్యంగా […] -
Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్, ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌పై రాజస్థాన్ రాయల్స్ (RR) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ బరిలోకి దిగి రికార్డు సృష్టించిన ఈ యువ ఆటగాడు, బుమ్రా వంటి దిగ్గజ బౌలర్‌ను ఎదుర్కోవడంపై తనదైన శైలిలో స్పందించాడు. బుమ్రా బౌలింగ్ భీకరంగా ఏమీ లేదు.. ఇటీవల జరిగిన మ్యాచ్‌లో బుమ్రాతో […] -
Hyderabad Traffic: ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. ఏడాది పాటు ఈ ఏరియాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్..
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వాహనదారులకు ముఖ్య గమనిక. గచ్చిబౌలి, ఐఐఐటీ జంక్షన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భాగ్యనగరం శరవేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సామాన్య ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత […] -
Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..
“పుస్తెలు అమ్మైనా సరే పులస తినాల్సిందే” – ఇది గోదావరి జిల్లాల్లో పులస చేపకు ఉన్న క్రేజ్ గురించి చెప్పే ఒక ప్రసిద్ధ సామెత. ప్రపంచంలో ఎక్కడో పుట్టి, సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి గోదావరి తీరానికి వచ్చే ఈ చేప, కేవలం ఆహారం మాత్రమే కాదు, అదొక భావోద్వేగం. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో గోదావరికి వచ్చే ఎర్రటి వరద నీటిలో ఈదుకుంటూ వచ్చే పులసలు, ఆ సీజన్లోనే కనిపిస్తాయి. కానీ.. కాలం కాని […] -
Bangladesh Cricketers: క్రికెటర్ల శాలరీ పెరిగాయ్.. ఒకొక్కరికి ఎంతంటే..
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) దేశీయ క్రికెటర్ల జీతాలు, మ్యాచ్ ఫీజులను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడు, నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ పెంపును తమీమ్ ఇక్బాల్ నేతృత్వంలోని అడ్-హాక్ కమిటీ ఆమోదించింది. మహిళా క్రికెటర్ల ఫీజుల్లో భారీ మార్పు.. ఇంతకుముందు మహిళా క్రికెటర్లకు ఒక వన్డే మ్యాచ్‌కు కేవలం 1,000 టాకాలు (సుమారు రూ.750) మాత్రమే ఇచ్చేవారు. ఈ విషయం తెలుసుకున్న తమీమ్ ఇక్బాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్త […] -
Indian Growth: భారత వృద్ధి రేటును తగ్గించిన ప్రపంచ బ్యాంక్.. ప్రస్తుతం ఎంతంటే..
2026-27 ఆర్థిక సంవత్సరంలో (FY27) భారత ఆర్థిక వృద్ధి 6.6 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. బలమైన దేశీయ డిమాండ్ , ఎగుమతుల కారణంగా FY25లో 7.1 శాతంగా ఉన్న వృద్ధి, FY26 నాటికి 7.6 శాతానికి పెరుగుతుందని పేర్కొంది. అయితే.. ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా వృద్ధి రేటు తగ్గే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ఆహారం, ఇంధన ధరల పెరుగుదల , రూపాయి విలువ క్షీణత వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.9 శాతంగా […] -
IMDb Best IPL Matches: ఇన్ని సీజన్లలో టాప్ 5 బెస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లు ఏవో తెలుసా..
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్ లీగ్ ఐపీఎల్ (IPL)లో ఎన్నో అద్భుతమైన మ్యాచులు జరిగాయి. ఈ నేపథ్యంలో.. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ IMDb క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన టాప్-5 ఐపీఎల్ మ్యాచుల జాబితాను విడుదల చేసింది. ఆ వివరాలు ఇవే.. 1. 2019 ఫైనల్ (MI vs CSK): ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన ఫైనల్స్‌లో ఒకటి. ముంబై ఇండియన్స్ కేవలం 149 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ.. బౌలర్లు అద్భుతంగా పోరాడారు. ఆఖరి […] -
Sensational Verdict: ఆంటీ అన్నారని కోర్టుకు వెళ్లిన మహిళ.. తీర్పు ఏమొచ్చిందో తెలుసా..
సాధారణంగా మన దగ్గర పెద్దవారిని గౌరవంగా ‘ఆంటీ’ అని పిలవడం అలవాటు. కానీ, లండన్‌లో ఒక భారత సంతతి మహిళను అలా పిలవడం సదరు వ్యక్తికి భారీ జరిమానాను, సదరు సంస్థకు కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితిని తెచ్చిపెట్టింది. బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS)లో హెల్త్‌కేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఇల్డా ఎస్టెవ్స్ (61) అనే భారత సంతతి మహిళ.. తన సహోద్యోగిపై వేధింపుల కేసు వేసి విజయం సాధించారు. అసలు ఏం జరిగింది..? పశ్చిమ లండన్ […] -
Nobel Peace Prize: ‘మేము యుద్ధాన్ని ఆపాం.. శాంతి బహుమతి మాకే ఇవ్వండి’: పాక్ ప్రధాని
ప్రస్తుతం పాకిస్థాన్ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. అదేంటంటే.. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపి, ప్రపంచాన్ని కాపాడినందుకు గాను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లకు ‘నోబెల్ శాంతి బహుమతి’ ఇవ్వాలట.. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా, పాక్ మీడియా మాత్రం దీన్ని చాలా సీరియస్‌గా ప్రచారం చేస్తోంది. ఏం జరిగిందంటే..? ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినప్పుడు, పాకిస్థాన్ మధ్యవర్తిగా ఉండి యుద్ధాన్ని నివారించిందని అక్కడి మీడియా చెప్పుకుంటోంది. […]
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
-
Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
-
OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
-
Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
-
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!