Nobel Peace Prize: ‘మేము యుద్ధాన్ని ఆపాం.. శాంతి బహుమతి మాకే ఇవ్వండి’: పాక్ ప్రధాని
- పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ ప్రచారం..
- ప్రపంచ శాంతి నెలకొల్పామని చెప్పుకుంటున్న పాక్ మీడియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం పాకిస్థాన్ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. అదేంటంటే.. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపి, ప్రపంచాన్ని కాపాడినందుకు గాను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లకు ‘నోబెల్ శాంతి బహుమతి’ ఇవ్వాలట.. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా, పాక్ మీడియా మాత్రం దీన్ని చాలా సీరియస్‌గా ప్రచారం చేస్తోంది.
ఏం జరిగిందంటే..?
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినప్పుడు, పాకిస్థాన్ మధ్యవర్తిగా ఉండి యుద్ధాన్ని నివారించిందని అక్కడి మీడియా చెప్పుకుంటోంది. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఈ ఇద్దరు నేతలు ఒక ‘నమ్మకమైన సమాచార దూత’గా పనిచేశారట. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలకుండా కాపాడిన ఘనత అంతా పాకిస్థాన్‌దే అని వారు భుజాలు చరుచుకుంటున్నారు. లెబనాన్‌లో 250 మంది మరణించిన గంటల వ్యవధిలోనే ఈ డిమాండ్ రావడం గమనార్హం.
Also Read
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
ఇస్లామాబాద్‌లో ‘శాంతి’ చర్చలు..
తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత.. ఏప్రిల్ 10న (శుక్రవారం) అమెరికా, ఇరాన్ ప్రతినిధులను తమ దేశానికి పిలిచి విందు ఇచ్చి చర్చలు జరుపుతామని షరీఫ్ గారు ఎక్స్‌లో (X) పోస్ట్ కూడా చేశారు. దీనికి ‘ఇస్లామాబాద్ టాక్స్’ అని పేరు కూడా పెట్టేసుకున్నారు. టర్కీ, ఈజిప్ట్, చైనా, సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా చర్చలకు ప్రయత్నించినా.. క్రెడిట్ మాత్రం మాకే రావాలని పాక్ మీడియా ఆరాటపడుతోంది.
అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది..
సరే.. పాకిస్థాన్ ఇంతలా కష్టపడిందని అనుకుందాం.. కానీ నోబెల్ శాంతి బహుమతి కోసం అసలు యుద్ధాన్ని ఆపే గడువు విధించిన డొనాల్డ్ ట్రంప్ ఊరుకుంటారా? ఎక్కడైనా క్రెడిట్ దొరికితే ముందుండే ట్రంప్ మామ, ఈ శాంతి బహుమతిని పాక్ ప్రధానికి, ఆర్మీ చీఫ్‌కు ఎలా వదిలేస్తారు..? అసలే పాక్, ఇండియా మధ్య ఆపరేషన్ సింధూర్ యుద్ధాన్ని ఆపినందుకు అప్పటి నుంచి శాంతి బహుమతి ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు.
సొంత దేశంలో ఆర్థిక కష్టాలు, అప్పులతో సతమతమవుతున్న పాకిస్థాన్.. ఇప్పుడు ప్రపంచ శాంతిని కాపాడామని ‘నోబెల్’ కావాలని అడగడం చూస్తుంటే.. వారి ఆత్మవిశ్వాసానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. నిజంగానే నోబెల్ కమిటీ గనుక ఈ వార్తలు వింటే ఏమనుకుంటుందో కానీ, పాక్ మీడియా మాత్రం అప్పుడే షరీఫ్, మునీర్‌ల కోసం అవార్డు వేదికను సిద్ధం చేసేస్తోంది. మొత్తానికి.. ప్రపంచ యుద్ధాన్ని ఆపిన ‘మహావీరుల’ జాబితాలో తమ పేర్లు ఉండాలని పాక్ ఆశపడుతోంది. చూద్దాం.. నోబెల్ వస్తుందో లేదో..!
తాజావార్తలు
-
Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
-
Balakrishna – Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
-
New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!