Sensational Verdict: ఆంటీ అన్నారని కోర్టుకు వెళ్లిన మహిళ.. తీర్పు ఏమొచ్చిందో తెలుసా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా మన దగ్గర పెద్దవారిని గౌరవంగా ‘ఆంటీ’ అని పిలవడం అలవాటు. కానీ, లండన్‌లో ఒక భారత సంతతి మహిళను అలా పిలవడం సదరు వ్యక్తికి భారీ జరిమానాను, సదరు సంస్థకు కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితిని తెచ్చిపెట్టింది. బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS)లో హెల్త్‌కేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఇల్డా ఎస్టెవ్స్ (61) అనే భారత సంతతి మహిళ.. తన సహోద్యోగిపై వేధింపుల కేసు వేసి విజయం సాధించారు.
అసలు ఏం జరిగింది..?
పశ్చిమ లండన్ ఎన్‌హెచ్‌ఎస్ ట్రస్ట్‌లో పనిచేస్తున్న ఇల్డాను, ఘనా దేశానికి చెందిన చార్లెస్ ఒప్పాంగ్ అనే స్టాఫ్ నర్స్ తరచూ “ఆంటీ” అని పిలిచేవాడు. తనను అలా పిలవవద్దని, పేరుతో పిలవాలని ఇల్డా పలుమార్లు కోరినప్పటికీ అతను వినలేదు. ఆఫీసు కారిడార్లలో.. అందరి ముందు ఆమెను అలా పిలుస్తూ ఎగతాళి చేసేవాడు. అంతేకాకుండా.. మరో వృద్ధ సహోద్యోగితో ఆమెకు జంట కుదురుతుందని కూడా వ్యాఖ్యానించాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఇల్డా, ఇది తన వయస్సును, లింగాన్ని కించపరచడమేనని వాట్‌ఫోర్డ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
ఈ కేసును విచారించిన జడ్జి జార్జ్ అల్లియట్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఘనా సంస్కృతిలో ‘ఆంటీ’ అనేది గౌరవసూచక పదం కావొచ్చు.. కానీ అవతలి వ్యక్తికి ఇష్టం లేనప్పుడు అలా పిలవడం వేధింపుల కిందకే వస్తుంది. చార్లెస్ ఒప్పాంగ్ కావాలనే హాస్యం పేరుతో ఆమెను ఇబ్బంది పెట్టాడని కోర్టు నిర్ధారించింది. ఇల్డా మనోభావాలను దెబ్బతీసినందుకు గాను 1,425.15 పౌండ్లు (సుమారు రూ. 1.8 లక్షలు) నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టు ఎన్‌హెచ్‌ఎస్ ట్రస్ట్‌ను ఆదేశించింది.
పాశ్చాత్య దేశాలలో.. ముఖ్యంగా పని ప్రదేశాలలో (Workplaces), వృత్తిపరమైన మర్యాదలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ ఎవరినైనా వారి అనుమతి లేకుండా వయస్సును సూచించే పదాలతో పిలవడం ‘ఏజ్ డిస్క్రిమినేషన్’ కిందకు వస్తుంది. ఈ తీర్పుతో పని చేసే చోట ఎదుటివారి ఇష్టాయిష్టాలను గౌరవించడం ఎంత ముఖ్యమో మరోసారి రుజువైంది. భారత సంతతి మహిళ పట్టుదలతో పోరాడి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మరికొందరు మాత్రం ఆంటీ అని పిలవడంలో తప్పేముంది అంటూ సోషల్ మీడియాల్లో కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!