Hyderabad Traffic: ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. ఏడాది పాటు ఈ ఏరియాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వాహనదారులకు ముఖ్య గమనిక. గచ్చిబౌలి, ఐఐఐటీ జంక్షన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భాగ్యనగరం శరవేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, సామాన్య ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే పట్టుదలతో తెలంగాణ ప్రభుత్వం ‘స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్’ (SRDP) కింద ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఐఐఐటీ జంక్షన్ వద్ద కొత్త ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి.
ఏడాది పాటు ట్రాఫిక్ మళ్లింపు..
నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఐఐఐటీ జంక్షన్ పరిసరాల్లో ఏడాది కాలం పాటు ట్రాఫిక్ మళ్లింపులు (Traffic Diversions) అమలులో ఉంటాయని సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేశ్ ప్రకటించారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.
Also Read
- 100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- 42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
- India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
Also Read:Hyderabad Traffic: ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. ఏడాది పాటు ఈ ఏరియాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్..
ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..
గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్లే వారు… గచ్చిబౌలి జంక్షన్ నుంచి ఐఐఐటీ జంక్షన్ చేరుకున్నాక, నేరుగా వెళ్లకుండా విప్రో జంక్షన్ వైపు మళ్లాలి. అక్కడ కుడివైపునకు (Right Turn) తిరిగి గౌలిదొడ్డి, గోపన్‌పల్లి జంక్షన్, నల్లగండ్ల మీదుగా లింగంపల్లి చేరుకోవచ్చు.
కోకాపేట, గౌలిదొడ్డి నుంచి వచ్చే వారు… విప్రో జంక్షన్ మీదుగా ఐఐఐటీ వైపు వచ్చే వాహనాలు.. విప్రో జంక్షన్ వద్ద నానక్‌రాంగూడ రోటరీ-2 దగ్గర ఎడమవైపునకు తిరిగి, అవుటర్ రింగ్ రోడ్ (ORR) సర్వీస్ రోడ్డు మీదుగా గచ్చిబౌలి జంక్షన్ చేరుకోవాలి.
లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వెళ్లే వారు.. హెచ్‌సీయూ (HCU) మెయిన్ గేట్ లేదా బస్ డిపో వద్ద ఎడమవైపునకు తిరిగి మజీద్‌బండ, శ్రీరాంనగర్ మీదుగా బొటానికల్ గార్డెన్ జంక్షన్ చేరుకోవాలి. అక్కడి నుంచి అంజయ్యనగర్ గుండా గచ్చిబౌలి వెళ్లవచ్చు.
ఈ మార్పుల వల్ల ప్రయాణ సమయం కొంత పెరిగే అవకాశం ఉన్నందున, ఐటీ ఉద్యోగులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. నగర అభివృద్ధి కోసం చేపట్టిన ఈ పనులకు ప్రజలంతా సహకరించాలని కోరారు.
తాజావార్తలు
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!