Veerababu Burugadda
Author- NTV Telugu-
RBL Bank: బిగ్ షాక్.. ఆర్బీఎల్ బ్యాంక్‌లో భారీ కుంభకోణం..
కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0’ ద్వారా భారీ ఆర్థిక కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. జిల్లాలోని కిసాన్‌నగర్ ఆర్బీఎల్ (RBL) బ్యాంక్ బ్రాంచ్ కేంద్రంగా జరిగిన ఈ భారీ స్కామ్‌లో సుమారు రూ.137 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. చైనాకు చెందిన కొందరు వ్యక్తులతో చేతులు కలిపి స్థానిక యువత ఈ మోసాలకు పాల్పడటం గమనార్హం. కుంభకోణం ఎలా జరిగింది..? ఈ ముఠా ప్రధానంగా ‘మ్యూల్ ఖాతాల’ (Mule Accounts) నెట్‌వర్క్‌ను […] -
Grameen Credit Score: సిబిల్ స్థానంలో ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్’.. బ్యాంకులకు కేంద్రం కీలక ఆదేశాలు..
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్’ అనే వినూత్న విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో వ్యక్తుల ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడానికి ‘సిబిల్’ (CIBIL) ఎలాగైతే ప్రామాణికమో.. అదే తరహాలో గ్రామీణ ప్రజలు, రైతులు , స్వయం సహాయక సంఘాల రుణ అర్హతను గుర్తించేందుకు ఈ ప్రత్యేక స్కోర్‌ను రూపొందించనున్నారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని […] -
Abbas: 11 ఏళ్ల తర్వాత అబ్బాస్ రీ ఎంట్రీ.. ఇంత కాలం ఎక్కడున్నాడు..? ఏం చేశాడంటే…
నటుడు అబ్బాస్ అంటే తొంభైల కాలంలో ఒక పెద్ద సెన్సేషన్. అప్పట్లో కుర్రాళ్లకు ఆయనో స్టైల్ ఐకాన్. ముఖ్యంగా ఆయన హెయిర్ స్టైల్, ఆకర్షణీయమైన రూపం చూసి ఫిదా అవ్వని వారు ఉండేవారు కాదు. మొదటి సినిమా ‘ప్రేమదేశం’తోనే రాత్రికి రాత్రే స్టార్డమ్ సంపాదించుకున్న అబ్బాస్.. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలతో దూసుకుపోయారు. అయితే.. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఆయన అకస్మాత్తుగా వెండితెరకు దూరమవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దాదాపు 11 ఏళ్ల […] -
Rain Alert: ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు..
వేసవి భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఉపశమనం కలిగించే వార్తను అందించింది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వాతావరణం చల్లబడనుందని అంచనా వేసింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణపై ప్రస్తుతం ఉన్న వాతావరణ ద్రోణి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మరఠ్వాడా నుంచి కర్ణాటక […] -
MP Kavya: గడ్డి మందుపై నిషేధం విధించాలి.. లోక్‌సభలో ఎంపీ కావ్య డిమాండ్..
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు)పై పూర్తి నిషేధం విధించాలని చేసిన డిమాండ్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం పార్లమెంట్ జీరో అవర్‌లో ఆమె ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈ రసాయనం వల్ల పర్యావరణం , మానవ ఆరోగ్యంపై పడుతున్న దుష్ప్రభావాలను వివరించారు. పారాక్వాట్ డైక్లోరైడ్ కేవలం కలుపు మొక్కలను నివారించే రసాయనం మాత్రమే కాదని, ఇది నేల, నీరు, గాలిని తీవ్రంగా కలుషితం చేస్తోందని ఎంపీ స్పష్టం చేశారు. వ్యవసాయ […] -
Commercial Gas: గుడ్ న్యూస్.. పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా..
పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త ఇంధన సరఫరా వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ప్రభావం భారతీయ మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ (LPG) సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, ఈ సంక్షోభం నుంచి పారిశ్రామిక రంగాన్ని గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. సరఫరా కోటా పెంపుదల.. గత కొన్ని వారాలుగా కమర్షియల్ సిలిండర్ల కొరతతో ఇబ్బంది పడుతున్న పరిశ్రమలకు […] -
Bank Holidays: బ్యాంకులకు వరుస సెలవులు.. వరుసగా మూడు రోజులు.
వరుస సెలవుల కారణంగా వచ్చే వారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు మూడు రోజుల పాటు విరామం కలగనుంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం (మార్చి ఆఖరు) కావడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతుంటాయి. అయితే, పండుగలు , వారాంతపు సెలవులు ఒకేసారి రావడంతో ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వచ్చే శుక్రవారం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా బ్యాంకులకు ప్రభుత్వ సెలవు ఉంది. ఆ తర్వాతి రోజు నాలుగో […] -
Sad: పాల కోసం ఏడ్చిన చిన్నారి.. గొంతు నులిమి చంపేసిన కసాయి తల్లి..
పుట్టిన బిడ్డను చూసుకుని.. నవమాసాలు మోసిన విషయాన్ని కూడా మర్చిపోతుంది తల్లి. బిడ్డ పుట్టిన ఆనందం.. ఏ కన్నతల్లి కళ్లల్లోనైనా స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటిది.. తన బిడ్డను తానే చంపేసుకుంది తల్లి.. అనే మాట వింటేనే ఎంతో హృదయవిదారకంగా అనిపిస్తుంది. అలాంటి ఘటనే తిరుపతి జిల్లాలో జరిగింది. కేవలం ఏడుపు ఆపడం లేదని చంపేసింది కన్న తల్లి. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డపైనే అంతటి కర్కశమైన నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఈ కేసులో అసలేం జరిగింది? బిడ్డ […] -
Mister Death: మిస్టర్ డెత్.. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహం..
చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో గుర్తుపట్టలేని స్థితిలో లభించిన ఓ మృతదేహం తీవ్ర కలకలం రేపుతోంది. మృతి చెందిన వ్యక్తి వయసు 17 నుంచి 20 ఏళ్లలోపు ఉండడం, అదే సమయంలో తిరుపతిలో ఓ విద్యార్థి గత ఐదు రోజులుగా అదృశ్యం అవడంతో, అసలు చనిపోయిన వ్యక్తికి, అదృశ్యమైన విద్యార్థికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. చనిపోయిన వ్యక్తి ఎవరు? అదృశ్యమైన విద్యార్థి ఎక్కడున్నారు? అని ఇటు చిత్తూరు పోలీసులు, అటు తిరుపతి పోలీసులు […] -
Land Registrations: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ.. పని వేళలు పొడిగింపు..
తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ల పని వేళలను ప్రభుత్వం భారీగా పొడిగించింది. కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఈ […]
తాజావార్తలు
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!