Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పాలనలో సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించే దిశగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 2026, మే 06న 18 కీలక కార్పొరేషన్లకు చైర్మన్లను, 11 వైస్ చైర్మన్లను ఖరారు చేశారు. విద్యా మరియు భాషా విభాగానికి సంబంధించి తెలుగు అకాడెమీ చైర్మన్‌గా ప్రొ. వెంకటనారాయణ నియమితులయ్యారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే.. కమ్మ కార్పొరేషన్ బాధ్యతలను బండి రమేష్ (చైర్మన్), పరుచూరి మురళి (వైస్ చైర్మన్) చేపట్టగా.. వెలమ కార్పోరేషన్ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగ్ రావు ఎంపికయ్యారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సారథులుగా బస్వరాజు శ్రీనివాస్, పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్‌లు వ్యవహరిస్తారు.
బీసీ కుల వృత్తుల బలోపేతానికి సంబంధించి యాదవ సహకార సంస్థకు ఎం. రఘునాథ్ యాదవ్ (చైర్మన్), గజ్జి భాస్కర్ యాదవ్ (వైస్ చైర్మన్).. గౌడ సహకార సంస్థకు మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్ (చైర్మన్), కేసం నాగరాజు గౌడ్ (వైస్ చైర్మన్) నియమితులయ్యారు. మున్నూరుకాపు సహకార సంస్థకు బొమ్మ శ్రీరామ్, అల్లం భాస్కర్లు చైర్మన్, వైస్ చైర్మన్లుగా బాధ్యతలు తీసుకోనున్నారు. చేనేత అభివృద్ధి సంస్థ (TSCO) బాధ్యతలను దూడెం వెంకట్ రమణ, జక్కని అనితలకు అప్పగించగా.. పద్మశాలీ కార్పోరేషన్ చైర్మన్‌గా గూడూరు శ్రీనివాస్ ఎంపికయ్యారు.
Also Read
- Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
మరికొన్ని కీలక నియామకాల్లో వడ్డెర సహకార సంస్థకు గుంజా రేణుక నారాయణ మరియు బత్తుల వెంకటేష్, రజక సహకార సంస్థకు డాక్టర్ దాసరిరాజు అజయ్ కుమార్ మరియు బంగారు బాబు, మేర సహకార సంస్థకు సంగ వెంకటరాజం మరియు ఎం. లక్ష్మీ నారాయణలు ఎంపికయ్యారు. వాల్మీకి బోయ సంస్థకు గట్టు తిమ్మప్ప, బోయ నాగేష్‌లు.. పెరిక సహకార సంస్థకు దొంగరి వెంకటేశ్వర్లు, బుడగం శ్రీనివాస్‌లు నాయకత్వం వహించనున్నారు.
పశుసంవర్ధక రంగానికి సంబంధించి గొర్రెలు, మేకల అభివృద్ధి ఫెడరేషన్ చైర్‌పర్సన్‌గా కొల్లె సరిత, లైవ్ స్టాక్ డెవలప్ మెంట్ ఏజెన్సీ చైర్మన్‌గా చరణ్ కౌశిక్ యాదవ్‌లను ప్రభుత్వం నియమించింది. భట్టరాజ కోఆపరేటివ్ ఫెడరేషన్ బాధ్యతలను సీహెచ్. బాల్ రాజుకు అప్పగించారు. చివరగా.. తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్‌గా సూదిని రామిరెడ్డి నియమితులు కాగా, అందులో సభ్యులుగా కృష్ణ కుమార్ నాగులూరి, బూస వేణుగోపాల్ యాదవ్‌లు బాధ్యతలు నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
-
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!