భారత న్యాయ వ్యవస్థపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత న్యాయ వ్యవస్థ బుల్డోజర్లతో నడవడం లేదని.. చట్టబద్ధమైన పాలనతోనే నిర్వహించబడుతుందని తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా గవాయ్ మారిషస్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ‘‘అతిపెద్ద ప్రజాస్వామ్యంలో చట్ట పాలన’’ అనే అంశంపై గవాయ్ ప్రసంగించారు. న్యాయమూర్తి ఒకేసారి జ్యూరీ, ఉరిశిక్షకుడిగా వ్యవహరించలేరని తెలిపారు. నిందితులను గుర్తించకముందే ఆస్తులను అక్రమంగా ధ్వంసం చేయడాన్ని తన తీర్పుతో నిరోధించినట్లు చెప్పారు. భారత న్యాయ వ్యవస్థ బుల్డోజర్ నియమం ద్వారా కాకుండా చట్ట నియమం ద్వారా నిర్వహించబడుతుందని గవాయ్ సందేశాన్ని పంపించారు.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్! అనుమానాలే నిజమయ్యాయి!
మున్సిపల్ చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలతో నిందితులను దోషులుగా నిర్ధారించకముందే వారి ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని పిటిషన్లు కోరారు. దీంతో సుప్రీంకోర్టు పరిపాలనా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తూ తీర్పు వెలువరించింది. ఇదే విషయాన్ని గవాయ్ గుర్తు చేస్తూ.. కచ్చితమైన విధానాలు పాటించకుండా భవిష్యత్‌లో కూల్చివేతలు జరగకుండా చూసుకోవడానికి మార్గదర్శకాలను రూపొందించినట్లు గవాయ్ గుర్తుచేశారు. నిందితులను గుర్తించకముందే ఆస్తులను ధ్వంసం చేయకుండా తన తీర్పు ద్వారా కట్టడి చేసినట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Israel-Hamas: తక్షణమే బందీలను విడుదల చేయండి.. హమాస్‌కు ఇజ్రాయెల్ సూచన
‘‘ఏదైనా చట్టబద్ధం చేయబడినంత మాత్రాన అది న్యాయమైనదని అర్థం కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం. చరిత్ర ఈ బాధాకరమైన సత్యానికి అనేక ఉదాహరణలను అందిస్తుంది. ఉదాహరణకు బానిసత్వం ఒకప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో చట్టబద్ధమైనది. భారతదేశంలో 1871 నాటి క్రిమినల్ ట్రైబ్స్ చట్టం వంటి వలస చట్టాలు మొత్తం సమాజాలను, తెగలను పుట్టుకతోనే నేరస్థులుగా ముద్రించాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలోని చట్టాలు స్థానిక ప్రజలను, అట్టడుగు వర్గాలను శిక్షించాయి. వ్యవస్థాగత అన్యాయాన్ని బలోపేతం చేశాయి. అణచివేత చట్ట వ్యవస్థలకు వ్యతిరేకంగా ప్రతిఘటనను అణిచివేసేందుకు దేశద్రోహ చట్టాలను తరచుగా ఉపయోగించేవారు.’’ అని గవాయ్ గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. భారీగా పెరిగిన ధరలు