భారత సంతతికి చెందిన అమెరికా రక్షణ వ్యూహకర్త ఆష్లై టెల్లిస్(64) అరెస్ట్ అయ్యారు. జాతీయ రక్షణ సమాచారాన్ని చట్ట విరుద్ధంగా భద్రపరిచినందుకు అభియోగాలు మోపబడ్డాయి. సమాఖ్య దర్యాప్తు తర్వాత అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టెల్లిస్ అమెరికా చట్టాన్ని ఉల్లంఘించారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. రక్షణ పత్రాలను రహస్యంగా దొంగిలించి చైనా అధికారులతో సమావేశమయ్యారనే ఆరోపణలపై అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Beangal Rape case: వైద్య విద్యార్థిని అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్.. బాయ్‌ఫ్రెండ్ అరెస్ట్..
యూఎస్ న్యాయవాది లిండ్సే హాలిగన్ ఒక పత్రికా ప్రకటనలో అభియోగాలు వెల్లడించారు. ‘‘మా పౌరుల భద్రత, భద్రతకు తీవ్ర ప్రమాదాన్ని’’ కలిగిస్తుందని పేర్కొన్నారు. నేరం రుజువైతే టెల్లిస్‌కు 10 ఏళ్లు జైలు శిక్ష, భారీగా జరిమానా పడే అవకాశం ఉంది. సంబంధిత సామాగ్రిని జప్తు చేసే అవకాశం ఉంది. అయితే నేరం రుజువైంత వరకు టెల్లిస్ నిర్దోషిగానే పరిగణించబడతారు.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 19 మంది సజీవ దహనం..
ఆష్లే టెల్లిస్..
ఆష్లే టెల్లిస్ ప్రముఖ విద్యావేత్త, విధాన నిపుణుడు, దక్షిణాసియా భద్రత, అమెరికా-భారత్ సంబంధాలపై వాషింగ్టన్ అగ్ర శ్రేణి నిపుణుల్లో ఒకరిగా ఆష్లై టెల్లిస్ గుర్తుంపు పొందారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్‌కు ప్రత్యేక సహాయకుడిగా జాతీయ భద్రతా మండలిలో పనిచేశారు. రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌కు సీనియర్ సలహాదారుగా కూడా పనిచేశారు. అమెరికా-భారత పౌర అణు ఒప్పందంపై చర్చలు జరపడంలో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ ఉద్యోగానికి ముందు RAND కార్పొరేషన్‌లో సీనియర్ పాలసీ విశ్లేషకుడు, ప్రొఫెసర్‌గా పనిచేశారు. అనేక రచనలు ఉన్నాయి. న్యూక్లియర్ ట్రాన్సిషన్స్ ఇన్ సదరన్ ఆసియా, రివైజింగ్ యుఎస్ గ్రాండ్ స్ట్రాటజీ టువార్డ్ చైనా వంటి పుస్తకాలు ఉన్నాయి. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్, ఇతర వృత్తిపరమైన సంస్థలలో సభ్యుడిగా కూడా ఉన్నారు.