జపాన్ చరిత్రలో సనే తకైచి సరికొత్త రికార్డ్ సృష్టించారు. తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి ఎన్నికయ్యారు. మంగళవారం జపాన్ పార్లమెంట్ దిగువ సభలో జరిగిన ఓటింగ్‌లో సనే తకైచి విజయం సాధించారు. మొదటి రౌండ్ ఓటింగ్‌లో ఊహించని విధింగా మెజార్టీ సాధించారు. దీంతో జపాన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికై రికార్డ్ సృష్టించారు. చక్రవర్తిని కలిసిన తర్వాత సనే తకైచి అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

జపాన్‌లో ఇప్పటి వరకు పురుషులే ఆదిపత్యం చెలాయిస్తూ వచ్చారు. ఆ రికార్డ్‌ను 64 ఏళ్ల సనే తకైచి తిరగరాసింది. పురుష నాయకత్వాన్ని పక్కకు నెట్టి దేశ చరిత్రను మార్చేశారు. ఐదేళ్ల కాలంలో పలువురు ప్రధానులు మారారు. తాజాగా ఐదో ప్రధానిగా సనే తకైచి ఎన్నికయ్యారు.
ఇది కూడా చదవండి: Trump: చైనాకు ట్రంప్ మరో హెచ్చరిక.. అదే జరిగితే 155 శాతం సుంకం ఉంటుందని వార్నింగ్
అక్టోబర్ నెల ప్రారంభంలో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) నాయకత్వాన్ని తకైచి గెలుచుకున్నారు. 44 ఏళ్ల యువ రాజకీయ నాయకుడు షింజిరో కోయిజుమిని ఓడించి నిలిచారు. దీంతో ఆమె దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. తాజాగా జరిగిన ఓటింగ్‌లో భారీ మెజార్టీతో గెలిచి అధికారికంగా ప్రధానిగా నిలిచారు.
ఇది కూడా చదవండి: Gold Rates: వామ్మో మళ్లీ షాకిచ్చిన పసిడి ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
షిగేరు ఇషిబా ఇటీవల ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీంతో జపాన్ ప్రధానమంత్రి పదవీ ఖాళీ అయింది. దీంతో షిగేరు ఇషిబా స్థానంలో తకైచి తాజాగా ఎన్నికయ్యారు. 1993లో స్వస్థలమైన నారా నుంచి తకైచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అనంతరం ప్రభుత్వంలో ఆర్థిక భద్రత, అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వ మంత్రితో సహా అనేక కీలక పాత్రలు నిర్వహించారు. ఇక తకైచి స్వలింగ్ వివాహాన్ని వ్యతిరేకిస్తారు. తకైచి.. బ్రిటిష్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ అభిమాని.
జపాన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన తకైచికి ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో కీలక పోస్ట్ పెట్టారు. ‘‘భారతదేశం-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను. ఇండో-పసిఫిక్ అంతకు మించి శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం లోతైన సంబంధాలు చాలా ముఖ్యమైనవి.’’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
Prime Minister Narendra Modi congratulates Sanae Takaichi, on being elected as the Prime Minister of Japan.
PM Modi tweets, "I look forward to working closely with you to further strengthen the India–Japan Special Strategic and Global Partnership. Our deepening ties are vital… pic.twitter.com/jTibIXoFGf
— ANI (@ANI) October 21, 2025