గతేడాది సస్పెండ్‌కు గురైన కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ గురువారం బీజేపీలో చేరారు. పాటియాలా ఎంపీగా ఉన్న ఆమెను గత ఏడాది కాంగ్రెస్ సస్పెండ్ చేసింది.
ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. బుధవారమే రష్యా అధ్యక్షుడు పుతిన్.. అణు యుద్ధం తప్పదంటూ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాలపై డ్రోన్ దాడులను ప్రయోగించింది.
ఉజ్బెకిస్థాన్‌కు చెందిన 37 ఏళ్ల జరీన్ అనే మహిళా టూరిస్ట్ బెంగళూరులోని ఓ హోటల్లో శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
సార్వత్రిక ఎన్నికల ముందు పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. 2014కు ముందు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నారీమణులపై కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో గ్యారంటీల పేరుతో అధికారం ఛేజిక్కించుకున్నాయి.