ఈనెల 1-3 తేదీల్లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వివాహ వేడుకలు ఎంతో ఘనంగా జరిగిన విషయం తెలిసింది. తాజాగా రాధిక చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో పేరుగాంచిన ఓర్రీ దీన్ని ఇన్‌స్ట్రాలో పోస్టు చేశాడు.
ఓర్రీ-రాధిక గర్బా బీట్‌లకు ఉత్సాహంగా నృత్యం చేసింది. ఇక రాధిక బంగారు రంగు గౌనులో తన జుట్టును పోనీటైల్‌లో కట్టింది. శక్తివంతమైన బహుళ-రంగు కోటు సూట్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఓర్రీగా ప్రసిద్ధి చెందిన ఓర్హాన్ అవత్రమ్‌నై ఇటీవల అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో పెళ్లికూతురు రాధికతో కలిసి డ్యాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓర్రీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి పెట్టాడు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోలో ఓర్రీ-రాధిక గర్బా బీట్‌లకు ఆనందంగా నృత్యం చేస్తుంటే వారి వెనుక వేదికపై దాండియా కర్రలతో నృత్యాలు చేస్తూ ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాధిక డ్యాన్స్‌ను చూసిన నెటిజన్లు సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు.
మార్చి 1 నుంచి మూడ్రోజుల పాటు జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులంతా ఈ వేడుకలకు హాజరయ్యారు.