US: అమెరికాలో మరో కలకలం.. పాలస్తీనా జెండా ఎగురవేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా యూనివర్సిటీల్లో తాజాగా మరో కలవరం చోటుచేసుకుంది. గత వారం పాలస్తీనా అనుకూల నిరసనలతో విశ్వవిద్యాలయాలు అట్టుడికాయి. మరోసారి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తీవ్ర కలకలం చెలరేగింది. ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనకారులు అమెరికా జెండా స్థానంలో పాలస్తీనా జెండాను ఎగురవేశారు. దీంతో మరోసారి యూనివర్సిటీలో తీవ్ర కలకలం రేగింది. గాజా పోరులో ఇజ్రాయెల్‌కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు దద్దరిల్లుతున్నాయి.
ఇది కూడా చదవండి: Amit Shah: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల రద్దుపై స్పందించిన అమిత్ షా.. పోలీసులు కేసు నమోదు..!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
పాలస్తీనియన్లపై దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌తో ఆర్థిక సంబంధాలను అమెరికా తెంచుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హార్వర్డ్‌లోని ప్రఖ్యాత జాన్ హార్వర్డ్ విగ్రహంపై పాలస్తీనా జెండాను ఎగరవేశారు. వాస్తవంగా దానిపై అమెరికా జెండా ఉంటుంది. లేకపోతే ఎవరైనా విదేశీ ప్రతినిధుల వచ్చినప్పుడు వారి దేశ జెండాలను ఉంచుతారు. కానీ నిరసనకారులు అమెరికా జెండాను పక్కనపెట్టి.. పాలస్తీనాకు విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ దేశ జెండాను ఎగరవేశారు. హార్వర్డ్ ప్రతినిధి జొనాథన్ ఎల్ స్వెయిన్ ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ఇది విశ్వవిద్యాలయ నిబంధనలకు విరుద్ధమని వెల్లడించారు. ఈ ఘటన కారకులపై క్షమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Haryana : ఆస్పత్రిలో ఉంచిన శవాన్ని తినేసిన కీటకాలు.. ఆందోళన చేసిన కుటుంబసభ్యులు
తొలుత న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో మొదలైన ఈ ఆందోళనలు అగ్రరాజ్యమంతా విస్తరించాయి. దీంతో 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతియుత నిరసనల హక్కును తాము గౌరవిస్తామని జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు. అయితే విద్వేషపూరిత ప్రసంగాలను మాత్రం తీవ్రంగా ఖండిస్తామన్నారు. ఇదిలా ఉంటే.. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో చోటుచేసుకున్న నిరసనల్లో భారత సంతతికి చెందిన విద్యార్థులు అరెస్ట్ అయ్యారు.
ఇది కూడా చదవండి: Karnataka: దేవెగౌడ మనవడిపై లైంగిక ఆరోపణలు.. సిట్ విచారణ..!
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!