సార్వత్రిక ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో తొలి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గానికి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చెందిన డీప్‌ఫేక్ వీడియోల కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. శుక్రవారం స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ ఎక్స్ ఖాతాను నిర్వహిస్తున్న అరుణ్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు ఆయా రూపాల్లో నిరసనలు తెలియజేయడం చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు వినూత్నంగా నిరసనలు చేపట్టి వార్తల్లో నిలుస్తుంటారు.
గత కొద్ది రోజులుగా పాలస్తీనా అనుకూల ఆందోళనలతో అమెరికాలోని యూనివర్సీటీలు దద్దరిల్లుతున్నాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనలకు దిగారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.
ఉత్తరప్రదేశ్‌లో రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాహుల్ వెంట సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, తదితరులు ఉన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కేఎల్.శర్మ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట పెద్ద ఎత్తున స్థానిక పార్టీ శ్రేణుల తరలివచ్చారు.
అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థి మార్పుపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ఓటమి భయంతోనే గాంధీయేతర వ్యక్తికి సీటు ఇచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. అమేథీ నుంచి తప్పుకున్నారంటేనే ఓటమిని ముందుగానే అంగీకరించారని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో అమేథీ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోట. గాంధీ కుటుంబం ఇక్కడ నుంచి తిరిగి లేని విజయాలు సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఈ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది.