Amit Shah Fake Video: డీప్‌ఫేక్ వీడియో కేసులో కొనసాగుతున్న అరెస్ట్‌ల పర్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చెందిన డీప్‌ఫేక్ వీడియోల కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. శుక్రవారం స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ ఎక్స్ ఖాతాను నిర్వహిస్తున్న అరుణ్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిన్న రాత్రి ఆయన్న న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం ఐఎఫ్ఎస్‌వో యూనిట్ కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఇక శనివారం అరుణ్‌రెడ్డిని పాటియాల హౌస్ కోర్టులో హాజరుపర్చనున్నారు.
ఇది కూడా చదవండి: Actor Naresh : రానున్న రోజులలో జాగ్రత్త మిత్రమా.. ఎండ తీవ్రతపై నరేష్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
బీజేపీ మూడోసారి గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారంటూ హోంమంత్రి అమిత్ షాకు చెందిన ఓ నకిలీ వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇది కాస్త తెగవైరల్ అయింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం చర్యలు చేపట్టింది. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చింది. అలాగే పలువుర్ని అదుపులోకి తీసుకుంది.
అమిత్‌షా డీప్‌ఫేక్ వీడియో ఎక్కడ నుంచి వచ్చిందనే సందేహానికి తెరపడింది. ఆ ఫేక్ వీడియోను మొదట పోస్ట్ చేసినది తెలంగాణ నుంచేనంటూ ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఎక్స్ ట్విట్టర్ ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. మొదట పోస్ట్ చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని చూస్తున్నారు.
ఇది కూడా చదవండి: BRS KTR: చలువ పందిర్లు, త్రాగు నీరు ఏర్పాటు చేయండి.. మున్సిపల్ చైర్మన్ కు కేటీఆర్ ఆదేశం..
గత నెల 23న మెదక్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ గెలిస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ మాట్లాడినట్టు ఓ వీడియో ప్రత్యక్షమైంది. ఎక్స్, ఫేస్‌బుక్ ఖాతాల్లో అది వైరల్‌గా అయి దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు.. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేశవ్యాప్తంగా నలుగురిని అరెస్టు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె సతీశ్, శివకుమార్ అంబాలా, నవీన్, ఆస్మా తస్లీంలకు నోటీసులు జారీ చేశారు.
మరోవైపు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ముందు పోస్ట్ చేశారన్న దానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎక్స్, ఫేస్‌బుక్‌లను స్పెషల్ సెల్ పోలీసులు ఆదేశించారు. ఈ మేరకు ప్రాథమిక నివేదిక ఇచ్చిన ‘ఎక్స్’ సంస్థ.. తొలుత ఆ వీడియో పోస్ట్ అయినది తెలంగాణ నుంచేనని వెల్లడించింది. ఒక ల్యాండ్‌లైన్ ఐపీ అడ్రస్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయినట్టుగా పేర్కొంది. అయితే ఎవరు చేశారనేది ఇంకా వెల్లడించలేదు.
ఇది కూడా చదవండి: Kamalhasan : కమల్ కు షాక్ ఇచ్చిన ఆ స్టార్ డైరెక్టర్..?
తాజావార్తలు
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?