అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థి మార్పుపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ఓటమి భయంతోనే గాంధీయేతర వ్యక్తికి సీటు ఇచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. అమేథీ నుంచి తప్పుకున్నారంటేనే ఓటమిని ముందుగానే అంగీకరించారని పేర్కొన్నారు. నిజంగా గెలిచే సత్తా ఉంటే గాంధీ కుటుంబమే బరిలో ఉండేదని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. అమేథీలో తన ప్రత్యర్థికి స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. మా ప్రత్యర్థులు ఎవరైనా ఎదుర్కొంటామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: DOST Notification: దోస్త్ నోటిఫికేషన్ విడుదల.. మూడు విడుతల్లో అడ్మిషన్స్
గత ఎన్నికల్లో అమేథీ నుంచి స్మృతి ఇరానీ గెలుపొందారు. రాహుల్ గాంధీపై 55 వేల ఓట్ల మెజార్టీ ఆమె గెలుపొందారు. మరోసారి ఇదే స్థానం నుంచి ఆమె బరిలోకి దిగారు. తన ప్రత్యర్థి రాహుల్ గాంధీనే అని భావించారు. కానీ చివరికి రాహుల్ రాయ్‌బరేలీకి మారిపోయారు. ఇక అమేథీలో గాంధీ కుటుంబానికి విధేయుడైన కేఎల్.శర్మను రంగంలోకి దించారు. అమేథీలో నామినేషన్ గడువుకు శుక్రవారమే చివరి రోజు. అయితే ఈ ఉదయమే అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించింది. తిరిగి రాహులే పోటీ చేస్తారని భావించారు కానీ అనూహ్యంగా విధేయుడ్ని సీటు వరించింది. ఇక అమేథీలో రాహుల్ 2004, 2009, 2014లో మూడు సార్లు గెలుపొందారు. 2019లోనే ఆయన ఓటమి చెందారు. కేరళలోని వాయనాడ్ నుంచి గెలిచి ఎంపీ హోదాను నిలబెట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: CM YS Jagan: పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇక అంతే.. జగన్ వార్నింగ్