ఏపీలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం ఎంపీగా మూడోసారి విక్టరీ సాధించారు. దీంతో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్ర ఆభివృద్ధి కోసం.. ప్రజల బాధ్యత తీసుకొని కూటమిని గెలిపించాలని ముందుకు వచ్చారు. ఎర్రన్నాయుడు వారసుడిగా మూడోసారి తనకు మూడు లక్షల మెజార్టీతో అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రిగానే తిరిగి సభలో అడుగు పెడతానని చంద్రబాబు నిర్ణయించి బయటికి వచ్చారు. ఆ రోజే తాను చంద్రబాబును సీఎంగా పంపాలని సపథం చేశాను. తన పార్లమెంట్ స్థానంలోని ఏడు నియోజకవర్గాలను గెలిపించుకుని ఆయనకు గిఫ్టుగా ఇచ్చాను. కూటమి గెలుచుకోవటం వెనుక కొంతమంది త్యాగాలు ఉన్నాయి. రాష్ట్రంలో.. కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది.’’ అని రామ్మోహన్‌నాయుడి తెలిపారు.