దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలంతా సమావేశం అయ్యారు. సోనియా, రాహుల్, ప్రియాంక, తమిళనాడు సీఎం స్టాలిన్, శరద్ పవార్, సంజయ్ రౌత్, తేజస్వీ యాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్, తదితరలు పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలంతా చర్చిస్తున్నారు. కూటమి ఐక్యత కోసం చేయాల్సిన చర్యలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: Actress Hema: ‘మా’ నుంచి హేమ సస్పెన్షన్?
ఇక సమావేశంలో ఖర్గే ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఇండియా కూటమి నేతలందరికీ స్వాగతం పలికారు. అందరూ బాగా పోరాడారని.. ఐక్యంగా.. దృఢంగా పోరాడారని గుర్తుచేశారు. మోడీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని తెలిపారు. మోడీకి స్పష్టమైన నైతిక పరాజయం అని ఖర్గే పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Amjad Basha: ప్రజల తీర్పును గౌరవిస్తూ, నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు..
ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి అనూహ్యమైన సీట్లు సంపాదించింది. ఇక కాంగ్రెస్ భారీగా పుంజుకుంది. ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి సీట్ల గ్యాప్ పెద్దగా లేదు. పోటా పోటీగా రెండు కూటమిలు తలపడ్డాయి. ప్రస్తుతం ఇండియా కూటమి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తోంది.
#WATCH | INDIA bloc leaders hold a meeting at the residence of Congress president Mallikarjun Kharge in Delhi.
(Source: AICC) pic.twitter.com/1xtYlqQviE
— ANI (@ANI) June 5, 2024