US: తల్లి, సోదరుడ్ని కాల్చి ఎన్నారై ఆత్మహత్య
- న్యూయార్క్‌లో ఘోరం
- తల్లి.. సోదరుడ్ని కాల్చి ఎన్నారై ఆత్మహత్య
- సోదరుడు మృతి.. తల్లికి గాయాలు
- కుటుంబ సమస్యలే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుటుంబ సమస్యలు హత్యకు దారి తీశాయి. కరంజిత్ ముల్తానీ అనే వ్యక్తి.. తన సోదరుడ్ని కాల్చి చంపగా.. అడ్డొచ్చిన తల్లిని కాల్చడంతో ఆమె గాయపడింది. అనంతరం నిందితుడు తనకు తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘోరం శనివారం న్యాయార్క్‌లో చోటుచేసుకుంది.
న్యూయార్క్‌లోని రిచ్‌మండ్ హిల్ జిల్లాలోని క్వీన్స్ హోమ్‌లో కరంజిత్ ముల్తానీ (౩౩) కుటుంబం నివాసం ఉంటుంది. ఇతనికి ముగ్గురు పిల్లలు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతున్నాడు. బిజినెస్ దెబ్బతినడంతో ఆర్థికంగా సతమతం అవుతున్నాడు. దీంతో కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయి. పైగా కుటుంబ సభ్యులు ఎగతాళిగా మాట్లాడడం.. కరంజిత్‌కు కోపాన్ని తెప్పించింది. ఇదే విషయంపై శనివారం మరోసారి ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో ఆవేశంలో కరంజిత్ తుపాకీ తీసుకుని తన సోదరుడైన విపన్‌పాల్ ముల్తానీ (27)ని కాల్చి చంపాడు. అడ్డుకోబోయిన తల్లిపైన కాల్పులు జరిపాడు. ఆమె తీవ్రంగా గాయపడింది. అనంతరం నిందితుడు తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కరంజిత్ మృతదేహం వీధిలో ప్రత్యక్షమైంది. కాల్పులు అనంతరం అతడు ఇంట్లో నుంచి పారిపోయి ఉండొచ్చని తెలుస్తోంది. అతని తలపై గాయం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్గానికి తరలించారు.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విపన్‌పాల్‌పై తొమ్మిది సార్లు కాల్పులు జరిపినట్లుగా గుర్తించారు. ఇక తల్లి చేయి, మొండెంపై గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత ఇరుగుపొరుగు వారు ఆశ్యర్యపోయారు. ఎప్పుడూ గొడవ పడినట్లుగా తెలియదని చెప్పారు. న్యూయార్క్ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ నేరంపై దర్యాప్తు చేస్తోంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!