ఆదివారం మోడీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్డీఏ పక్షాలకు ఆయా శాఖలు దక్కాయి. ఇక బీజేపీ కేంద్రమంత్రులకు పాత శాఖలే దక్కాయి. ఇక తాజాగా ప్రధాని మోడీ తన సోషల్ మీడియా ఖాతాల్లో మార్పులు చేశారు.
ఇది కూడా చదవండి: Snakebite: పాముకాటుకు బాలిక బలి.. ములుగు జిల్లాలో ఘటన
ఎన్నికల సమయంలో బీజేపీ నేతల సోషల్ మీడియా ఖాతాల్లో మోడీ కా పరివార్ అనే నినాదం ప్రత్యేకంగా కనిపించింది. ‘‘ప్రధానికి కుటుంబం లేదు. అందుకే వారసత్వ, కుటుంబ రాజకీయాలపై విమర్శలు చేస్తున్నారు’’ అని ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా కమలం పార్టీ నేతలు ఆ నినాదాన్ని ప్రతిధ్వనింపజేశారు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రధాని మోడీ కీలక సూచన చేశారు. మనమంతా ఒకే కుటుంబమనే సందేశాన్ని ‘మోడీ కా పరివార్’ సమర్థంగా చాటిచెప్పిందని, ఇప్పుడు దీన్ని తొలగించాల్సిందిగా ‘ఎక్స్’ వేదికగా విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Jammu Kashmir: కథువాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం..
ఎన్నికల సమయంలో తన మీద అభిమానానికి గుర్తుగా ప్రజలంతా తమ సోషల్ మీడియా ఖాతా పేర్లలో ‘మోడీ కా పరివార్’ చేర్చారని గుర్తుచేశారు. ఇది తనకు చాలా శక్తినిచ్చిందన్నారు. ఈ క్రమంలోనే వరుసగా మూడోసారి ఎన్డీయేకు విజయం కట్టబెట్టారన్నారు. దేశాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలంటూ అధికారం అప్పగించారని తెలిపారు. మనమంతా ఒకే కుటుంబం అనే సందేశాన్ని చాటిచెప్పినందుకు ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.
ఇక మోడీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ప్రొఫైల్ పిక్చర్, కవర్ ఇమేజ్‌లను కూడా మార్చారు. నూతన మంత్రివర్గంతో దిగిన ఫొటోను కవర్ ఇమేజ్‌గా ఉంచారు. ప్రధానమంత్రి కార్యాలయం సైతం ‘ఎక్స్’ అకౌంట్‌లో ఇదే విధమైన మార్పులు చేపట్టింది. రాజ్యాంగానికి మోడీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు కనిపిస్తోన్న ఫొటోను కవర్ ఇమేజ్‌గా ఉంచారు.
ఇది కూడా చదవండి: Yemen: యెమెన్‌లో విషాదం.. పడవ బోల్తా.. 49 మంది మృతి