Suresh Maddala
Author- NTV Telugu-
Ranya Rao: నటి కాదు.. పెద్ద కిలాడీ.. వెలుగులోకి రన్యా రావు బాగోతాలు
రన్యా రావు కన్నడ నటి. పైగా ఐపీఎస్ ఆఫీసర్ కుమార్తె. ఇప్పుడు ఆమె పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతుంది. ఏదో గొప్ప పని చేసిందనో.. ఘనకార్యం చేసిందనో కాదు. కుటుంబ గౌరవానికి తగ్గట్టుగా ఉండాల్సిన ఆమె.. నీచానికి ఒడిగట్టింది. విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారంటే.. ఈమె ఎంత పెద్ద కిలాడీనో అర్థం చేసుకోవచ్చు. -
Amit Shah: స్టాలిన్‌పై అమిత్ షా విసుర్లు.. ఎల్కేజీ విద్యార్థి.. స్కాలర్‌కు బోధించినట్టుంది
హిందీపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తమిళనాడుపై కేంద్రం బలవంతంగా హిందీ రుద్దుతోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీ రుద్దీ.. బీజేపీ గెలవాలని చూస్తోందని ఇటీవల డీఎంకే నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నేతలు పేర్కొన్నారు. -
పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.330, 22 క్యారెట్లపై రూ.300 తగ్గింది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,900గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.87,160గా నమోదైంది. -
Israel: పాలస్తీనాలో బందీలుగా ఉన్న 10 మంది భారతీయుల్ని రక్షించిన ఇజ్రాయెల్
పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో బందీలుగా ఉన్న 10 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయెల్ రక్షించింది. పది మంది భారతీయ నిర్మాణ కార్మికుల పాస్‌పోర్ట్‌లు లాక్ చేయబడ్డాయి. దీంతో వారంతా పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో బందీలుగా ఉన్నారు. మొత్తానికి నెల రోజుల తర్వాత ఇజ్రాయెల్ సైన్యం వారిని రక్షించింది. -
Starship Rocket: ఎలోన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. పేలిన స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్
అంతరిక్ష ప్రయోగంలో ఎలోన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్టార్‌షిప్ కార్యక్రమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గురువారం ప్రయోగించిన కొన్ని నిమిషాలకే స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. దక్షిణ ఫ్లోరిడా-బహామాస్ సమీపంలో రాకెట్ పేలిపోయి శిథిలాలు చెల్లాచెదురుగా కింద పడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Tahawwur Rana: ముంబై దాడుల కీలక సూత్రధారికి షాక్.. పిటిషన్ తిరస్కరించిన అమెరికా
26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారి తహవూర్ రాణాకు అమెరికా న్యాయస్థానం షాకిచ్చింది. తనను భారత్‌కు అప్పగించవద్దంటూ ఇటీవల యూఎస్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. -
Bengaluru: దారుణం.. బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న యువకుడు
కర్ణాటకలోని హోసూర్‌లో దారుణం జరిగింది. ఓ బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో బంజరు పొలాల్లో బాలిక ఏడుస్తూ, కేకలు వేస్తూ కనిపించింది. ఒక స్త్రీ, పురుషుడు ఉన్న కూడా ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. సోషల్ మీడియాలో వీడియో తెగవైరల్ కావడంతో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. -
PM Modi: నేడు, రేపు గుజరాత్, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మోడీ పర్యటన
ప్రధాని మోడీ ఈరోజు, రేపు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో, గుజరాత్లో పర్యటించనున్నారు. దాద్రా, నాగర్ హవేలి, డామన్, డయ్యు, గుజరాత్లో మోడీ పర్యటించనున్నారు. సిల్వాసాలో రూ.2,580 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. కొత్త ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేయనున్నారు. -
Rahul Gandhi: నేడు గుజరాత్లో రాహుల్ గాంధీ పర్యటన
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం గుజరాత్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు అహ్మదాబాద్‌లోని రాజీవ్ గాంధీ భవన్‌లోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశం జరగనుంది. మాజీ పీసీసీ అధ్యక్షులు, గుజరాత్ పీసీసీ సీనియర్ నాయకులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. -
Jaishankar: లండన్‌లో జైశంకర్‌పై దాడిని ఖండించిన భారత్
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో ఖలీస్తానీ ఉగ్రవాది దాడికి యత్నించాడు. అంతేకాకుండా భారత జాతీయ జెండాను చించేసి పడేశాడు. దీంతో అప్రమత్తమైన లండన్ పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఖలీస్తానీ ఆందోళనకారులను చెదరగొట్టారు. అయితే ఈ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండిచింది.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
-
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
-
Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..