పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో బందీలుగా ఉన్న 10 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయెల్ రక్షించింది. పది మంది భారతీయ నిర్మాణ కార్మికుల పాస్‌పోర్ట్‌లు లాక్ చేయబడ్డాయి. దీంతో వారంతా పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో బందీలుగా ఉన్నారు. మొత్తానికి నెల రోజుల తర్వాత ఇజ్రాయెల్ సైన్యం వారిని రక్షించింది.
ఇది కూడా చదవండి: Starship Rocket: ఎలోన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. పేలిన స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నేతృత్వంలో రాత్రిపూట నిర్వహించిన ఆపరేషన్‌లో కార్మికులను రక్షించి సురక్షితమైన ప్రదేశానికి తరలించారు. ఈ విషయం దర్యాప్తులో ఉందని ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. కార్మికులకు భద్రత కల్పించాలని ఇజ్రాయెల్ అధికారులను కోరినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.
ఇది కూడా చదవండి: Regina Cassandra : కసక్ లుక్ లో రెజీనా ‘కసాండ్రా’
2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి 250 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. అప్పటినుంచి గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. అప్పటి నుంచి పాలస్తీనా నిర్మాణ కార్మికులు ఇజ్రాయెల్‌లోకి రాకుండా అడ్డుకుంటోంది. అయితే గత ఏడాది కాలంలో భారతదేశం నుంచి దాదాపు 16,000 మంది కార్మికులు పరిశ్రమలో పని చేయడానికి ఇజ్రాయెల్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Kalpana : రూమర్స్ కు చెక్ పెడుతూ సింగర్ కల్పన సెల్ఫీ వీడియో..