Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
- టీఎంసీ సంక్షోభంపై సీఎం సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు..
- మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’ తగిలిందని కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suvendu Adhikari: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయిన టీఎంసీ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) షాక్ ఇచ్చింది. టీఎంసీ పేరును, ఎన్నికల గుర్తును ఫ్రీజ్ చేసింది. రెండు వర్గాలకు వేర్వేరు గుర్తుల్ని, పేర్లను కేటాయించింది. మమతా బెనర్జీ వర్గానికి ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, తిరుగుబాటువర్గమైన రిటబ్రత బెనర్జీ వర్గానికి ‘‘ఎన్వలప్ కవర్’’ కేటాయించింది.
ఇదిలా ఉంటే, ఈ పరిణామాలపై పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి స్పందించారు. మమతా బెనర్జీ పార్టీని ఐక్యంగా ఉంచలేకపోవడం వల్లే టీఎంసీ తన పేరు, ఎన్నికల గుర్తును కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు. దీనికి మమత అహంకారమే కారణమని, అహంకారం ప్రదర్శించే వారికి గుణపాఠం తప్పదని అన్నారు. ఈ పరిణామాన్ని ‘‘శ్రీరాముడి శాపం’’గా అభివర్ణించారు. భవిష్యత్తులో టీఎంసీ ఉనికి ఉండదని తాను ఎన్నికల సమయంలో చెప్పానని పేర్కొన్నారు. టీఎంసీ పేరు, ఎన్నికల గుర్తు కోల్పోవడంలో బీజేపీకి ఎలాంటి ప్రమేయం లేదని సువేందు స్పష్టం చేశారు. ఇది పూర్తిగా ఎన్నికల సంఘం నిర్ణయమే అని తెలిపారు.
Also Read
- TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
- Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
- FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
- Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
గతంలో మమతా బెనర్జీ హిందూ మతం, మహా కుంభమేళ, రామ మందిరంపై చేసిన వ్యాఖ్యల్ని కూడా సువేందు గుర్తుచేశారు. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిరసనగా మమతా బెనర్జీ చేసిన ర్యాలీని ఆయన గుర్తుచేశారు. ఈ పరిణామాలన్నింటితోనే మమతకు రాజకీయ గుణపాఠం ఎదురైందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
-
Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..