RBI: రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
- రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
- 98.04 శాతం నోట్లు రికవరీ అయినట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా రద్దైన రూ.2 వేల నోట్ల గురించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. దేశంలో చలామణి అయిన 2 వేల రూపాయల నోట్లలో దాదాపు 98.04 శాతం నోట్లు ప్రజల నుంచి తిరిగి బ్యాంకులకు వచ్చి చేరినట్లు సోమవారం ఆర్బీఐ తెలిపింది. కేవలం రూ.6,970 కోట్ల రూపాయల విలువ కలిగిన 2 వేల రూపాయల నోట్లు మాత్రమే ప్రస్తుతం ప్రజల దగ్గర ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది. 2023, మే 19న చలామణి నుంచి 2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించినట్లు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆర్బీఐ ఈ ప్రకటన చేసే సమయానికి, అంటే మే 19, 2023 నాటికి దేశంలో 3.56 లక్షల కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. అక్టోబర్ 31, 2024 నాటికి చలామణిలో ఉన్న 2 వేల రూపాయల నోట్ల సంఖ్య రూ.6,970 కోట్లకు పడిపోయినట్లు ఆర్బీఐ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Bengaluru: ఆకతాయిల అకృత్యం.. ప్రాణాలు తీసిన బాణాసంచా పందెం
Also Read
- Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
- Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
అక్టోబర్ 7, 2023 వరకు అన్ని బ్యాంకుల బ్రాంచుల్లో 2 వేల నోట్లను డిపాజిట్ లేదా ఎక్సేంజ్ చేసుకునే సదుపాయం ఉంది. ఆ తర్వాత నుంచి ఆర్బీఐకి చెందిన 19 ఆఫీసుల్లో 2 వేల నోట్లు మార్చుకునే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించింది. బెంగళూరు, హైదరాబాద్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగర్, చెన్నై, గౌహతి, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్ కత్తా, లక్నో, ముంబై, నాగ్ పూర్, పాట్నా, న్యూఢిల్లీ, తిరువనంతపురం, అహ్మదాబాద్ ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లో 2 వేల నోట్లను డిపాజిట్ గానీ, ఎక్సేంజ్ గానీ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీసుల్లో కూడా 2 వేల నోట్లను మార్చుకునే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: RK Roja: హోంమంత్రి రాజీనామా చేయాలి.. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి రోజా
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!